iQOO 12 5G Anniversary Edition తెచ్చిన ఐకూ.. సేల్ డేట్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
కొత్త వేరియంట్ iQOO 12 5G Anniversary Edition ను లాంఛ్ చేసింది
ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ ఆఫర్ తో అందించింది
ఈ ఫోన్ పైన 9 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది
ఐకూ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ఐకూ 12 టీజీ యొక్క కొత్త వేరియంట్ iQOO 12 5G Anniversary Edition ను లాంఛ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ స్మార్ట్ ఫోన్ చాలా ఆకర్షణీయమైన Desert Red కలర్ ఆప్షన్ మరియు విండ్ ప్రింటెడ్ టెక్స్ట్ తో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ అత్యంత వేగవంతమైన పెర్ఫర్మెన్స్ తో మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. అందుకే, కంపెనీ కూడా ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ ను కూడా తీసుకు వచ్చింది.
iQOO 12 5G Anniversary Edition: Price
ఐకూ కొత్తగా తీసుకు వచ్చిన ఈ లేటెస్ట్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరతో ప్రకటించింది. అయితే, ఇందులో బ్యాంక్ ఆఫర్ ను జత చేసినట్లు చెబుతోంది. ఐకూ ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ ఆఫర్ తో అందించింది. ఈ ఫోన్ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 3000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ అమౌంట్ తో కలిపి ఈ ఫోన్ రేటును ప్రకటించింది.
అలాగే, ఈ ఫోన్ పైన 9 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది. ఐకూ 12 5జి ఇప్పటికే మార్కెట్ లో మంచి అధరణ పొందింది మరియు కొత్త వేరియంట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఐకూ 12 5జి కొత్త వేరియంట్ ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: WhatsApp Down: ఒక్కసారిగా మూగబోయిన వాట్సాప్..!
iQOO 12 5G Anniversary Edition: ప్రత్యేకతలు
ఐకూ 12 5జి ఫోన్ యొక్క కొత్త యానివర్సరీ ఎడిషన్ ప్రీమియం లెదర్ ఫినిష్ మరియు లెథర్ రబ్బరింగ్ ప్రోసెస్ తో పాటు డిజెర్ట్ రెడ్ కలర్ తో మంచి ప్రమియం లుక్ ను కలిగి వుంది. ఐకూ 12 5జి ఫోన్ 2.1 మిలియన్స్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ కలిగిన Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ మరియు ప్రత్యేకమైన Q1 కంప్యూటింగ్ చిప్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ వెనుక 50MP + 64MP + 50MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ కెమేరా 100X టెలీ లెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలను షూట్ చెయవచ్చు. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగిన AMOLED LTPO డిస్ప్లే వుంది.
ఐకూ 12 5జి ఫోన్ 120 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగిన బిగ్ బ్యాటరీని కలిగి వుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ ఫోన్ కొత్త కలర్ మరియు లెథర్ డిజైన్ లో అదే స్పెక్స్ తో వచ్చింది.