iQOO 11 5G: భారీ డిస్కౌంట్ అఫర్ తో రేపు జరగనున్న ఫస్ట్ సేల్.!

iQOO 11 5G: భారీ డిస్కౌంట్ అఫర్ తో రేపు జరగనున్న ఫస్ట్ సేల్.!
HIGHLIGHTS

iQOO 11 5G రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది

ఇంట్రడక్టరీ అఫర్ లో భాగంగా రేపు ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుంది

ఐకూ 11 5G చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో భారతీయ మార్కెట్ లో లాంచ్ చెయ్యబడింది

ఐకూ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO 11 5G రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ పైన కంపెనీ అందించిన ఇంట్రడక్టరీ అఫర్ లో భాగంగా రేపు ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, బెస్ట్ డిస్ప్లే మరియు మంచి కెమేరా సెట్టింగ్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో భారతీయ మార్కెట్ లో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క ధర, ఆఫర్లు, స్పెక్స్ మరియు ఇతర వివరాల గురించి పూర్తిగా తెలుసుకోండి.

iQOO 11 5G: ధర

ఐకూ 11 5G స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB+256GB) ధర రూ.59,999 రూపాయలు. అలాగే, 16GB+128GB వేరియంట్ ధర రూ.64,999 రూపాయలుగా ప్రకటించింది. ఇంట్రడక్టరీ అఫర్ లో భాగంలో ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ.54,999 ధరకు, హై ఎండ్ వేరియంట్ ను రూ.59,999 ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 నుండి అమెజాన్ మరియు కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.                    

iQOO 11 5G: స్పెక్స్

ఐకూ 11 స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ FHD+ రిజల్యూషన్ తో LTPO4 AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1800 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐకూ ప్రీమియం ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఈ ట్రిపుల్ కెమెరాలో OIS సపోర్ట్ తో  50MP GN5 ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 13MP టెలిఫోటో కెమేరాలు. ముందుభాగంలో, 16 సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమ్ మరియు స్టన్నింగ్ కెమేరా విజువల్స్ కోసం ఈ ఫోన్లో V2 చిప్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo