Flipkart లో ఐ ఫోన్ 6 space grey మోడల్ తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ 36,990 రూ ఉంటే ఫ్లిప్ కార్ట్ దానిపై 5000 తగ్గించి 31,990 రూ లకు అందిస్తుంది. అయితే అదనంగా exchange ఆఫర్ లో 22,000 రూ వరకూ తగ్గింపు కూడా అందిస్తుంది. ఇంకా Axis Buzz క్రెడిట్ కార్డ్ పై పేమెంట్ చేస్తే అదనపు 5% డిస్కౌంట్ ఇస్తుంది ఫ్లిప్ కార్ట్. సో అన్నీ అనుకూలంగా ఉండి పై ఆఫర్స్ అన్ని వాడుకుంటే ఐ ఫోన్ 6 16GB స్పేస్ గ్రే కలర్ మోడల్ 9990 రూ లకు పొందగలరు. ఐ ఫోన్ 6 2015 లో లాంచ్ అయిన మోడల్.
గమనిక: 22,000 రూ ఎక్స్చేంజి ఆఫర్ అనేది కేవలం ఆపిల్ ఐ ఫోన్ 6S పైనే పనిచేస్తుంది, ప్రస్తుతానికి. కాని అప్ గ్రేడ్ మోడల్ ను అమ్మి(ఎక్స్చేంజి) ఓల్డ్ మోడల్ ఎవరు తీసుకుంటారో flipkart కే తెలియాలి. ఈ లింక్ లో ఫోన్ సెల్ అవుతుంది.
ఎక్స్చేంజి ఆఫర్ ఎలా పనిచేస్తుంది అసలు?
మీరు ఎక్స్చేంజి చేద్దామని అనుకుంటే మీ వద్ద ఉన్న మొబైల్ ను వెబ్ సైట్ లో పర్టికులర్ ఫోన్ క్రింద Exchange ఆప్షన్ బటన్ క్లిక్ చేసిన తరువాత వచ్చే లిస్టు లో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ కు ఎంత ఎక్స్చేంజి rate ఉందో చూపిస్తుంది వెబ్ సైట్. అది మీకు నచ్చితే okay చేసి, మీ ఫోన్ కు పలికిన ఎక్స్చేంజి ధర ను కొనదలచుకున్న కొత్త ఫోన్ అసలు ప్రైస్ లో కట్ చేసుకొని కొత్త ఫోన్ కొనగలరు. ఇక్కడ ఎక్స్చేంజి రేట్ అనేది మీరు ఇవ్వదలచుకున్న మొబైల్ క్రేజ్, బ్రాండ్ అండ్ కాస్ట్ బట్టి ఉంటుంది.
TIP: అయితే ఎక్స్చేంజి లో పెట్టుకుంటే వచ్చే తగ్గింపు ప్రైస్ కన్నా, అదే మొబైల్ ను olx వంటి సెకెండ్ హ్యాండ్ సైట్స్ లో అమ్మితే ఎక్కువ ధర పలికే అవకాశాలున్నాయి.
Apple iPhone 6 అమెజాన్ లో Rs.31,990 లకు కొనండి