వాటర్ ప్రూఫ్, ఎక్కువ ర్యామ్, అండ్ కొత్త డిజైన్ తో ఐ ఫోన్ 7?
ఇంకా one ఇయర్ ఉంది ఐ ఫోన్ 7 రిలీజ్ కావటానికి, కాని అప్పుడే రిపోర్ట్స్, రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనిపై వరల్డ్ వైడ్ గా ఉండే క్రేజ్ ఒక కారణం అయితే రెండవది ఐ ఫోన్ 7 , S సిరిస్ కాదు కాబట్టి, కొత్త మార్పులతో వస్తుంది.
లేటెస్ట్ చైనీస్ రిపోర్ట్స్ ప్రకారం ఇది వాటర్ ప్ర్రోఫ్ తో వస్తుంది. అలాగే డిజైన్ లో కూడా antenna stripes రిమూవ్ చేయబడతాయి. వాటర్ ప్ర్రోఫ్ పై గతంలో కూడా రిపోర్ట్ వచ్చింది.
దీనిలో 3gb ర్యామ్ ఉంటుంది అని ఇంతకముందే ఒక సోర్స్ రూమర్ వినిపించింది. ఐ ఫోన్ 6 వరకూ ఆపిల్ 2gb ర్యామ్ ను వాడలేదు. 6 అండ్ 6 ప్లస్ లోనే 2 gb ర్యామ్ వాడటం మొదలు పెట్టింది.
మళ్ళీ వెంటనే 3 gb ర్యామ్ కు వెళ్ళటానికి కారణం రోజు రోజుకీ పెరుగుతున్న యాప్స్ యొక్క విపరీతమైన రిసోర్సెస్. తైవాన్ సోర్సెస్ ప్రకారం నెక్స్ట్ మోడల్ compound మేటేరియాల్ తో వస్తుంది.
అయితే రూమర్స్ ఎన్ని ఉన్నా, ఆపిల్ మాత్రం అన్ని గేమ్ చేంజింగ్ మార్పులు ఒకే మోడల్ లో తీసుకు రాదు. ఎందుకంటే అన్నీ ఒక మోడల్ లో ఇన్నోవేట్ చేస్తే, నెక్స్ట్ మోడల్స్ కొత్తవి ఏమి పెట్టాలన్నా కంపెని చాలా కష్టపడాలి.
ఇది మనకు అర్థమైతే ఆపిల్ పైనే కాదు ఏ ఫోన్ పైనా విపరీతమైన అంచనాలను పెంచుకోము.