AnTuTu 6 లేటెస్ట్ వెర్షన్ లో ఆండ్రాయిడ్ – ఆపిల్ రెండింటిలో ఏవి ఫాస్ట్ గా ఉన్నాయి?

AnTuTu 6 లేటెస్ట్ వెర్షన్ లో ఆండ్రాయిడ్ – ఆపిల్ రెండింటిలో ఏవి ఫాస్ట్ గా ఉన్నాయి?

AnTuTu బెంచ్ మార్క్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేటెడ్ వెర్షన్ లో స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో హైయెస్ట్ స్కోర్ తో రన్ అవుతున్న లిస్టు బయట హల్ చల్ చేస్తుంది.

ఇంటర్నెట్ లో బాగా తిరుగుతున్న ఆ స్క్రీన్ షాట్ లో లేటెస్ట్ AnTuTu 6  ప్రకారం ఐ ఫోన్ 6S ప్లస్ అన్నిటి కన్నా టాప్ ప్లేస్ లో ఉంది. దీని బెంచ్మార్క్ స్కోర్ 132620.

దీనికి దగ్గరలో కనీసం ఏ ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆపిల్ తరువాత నెక్స్ట్ Huawei Mate 8 ఆండ్రాయిడ్ ఫోన్ 92746 స్కోర్ తో సెకెండ్ ప్లేస్ లో ఉంది.

తరువాత సామ్సంగ్ నోట్ 5 83364 స్కోర్ తో, oneplus 2 79747 స్కోర్ తో లైన్ లో ఉన్నాయి. టాప్ 10 లిస్టు లో ఆపిల్ ఐ ఫోన్ 6 ప్లస్ కూడా 6 వ స్థానంలో ఉంది.

అసలు బెంచ్ మార్క్ డేటా ను నమవచ్చా?

బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి కేవలం measurement అని చెప్పాలి. అన్ని సార్లు ఇది రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ కు తగ్గట్టుగా ఉండవు. స్కోర్ ఎక్కువుగా ఉన్నా, రియల్ use లో తక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మోడల్స్ ఉన్నాయి.

అలాగే స్కోర్ లో తక్కువ ఉన్నా, బయట బాగా పెర్ఫరం అయిన ఫోన్స్ కూడా ఉన్నాయి. సో టోటల్ స్కోర్స్ రాంగ్ అని చెప్పటానికి అవదు కాని అన్నీ సార్లు accurate గా reflect అవ్వవు. అంతే! ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం గురి చేస్తున్న విషయం ఆపిల్ సాధారణ డిఫరెన్స్ తో కాకుండా అంత దూరంగా అందరికీ అందని హై స్కోర్ లో ఉండటం.

AnTuTu 6 listing:

                                                                          

Geekbench single-core listing (Click to Enlarge):

                                                                           

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo