Gurgaon లోని ఒక రెస్టారెంట్ ఓనర్, కృష్ణ యాదవ్ తన స్నేహితుడితో మాట్లాడుతుండగా తన ఐ ఫోన్ 6 వేడెక్కి పేలిపోయింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ విషయం గత శనివారం, జూన్ 20 న చోటుచేసుకుంది.
యాదవ చెప్పిన దాని ప్రకారం, ear ఫోన్స్ పెట్టుకొని కారులో వెల్తున్నప్పుడు ఐ ఫోన్ లో మాట్లాడుతుండగా ఫోన్ నుండి స్పార్క్స్ వచ్చాయి. వెంటనే ఫోన్ వేడెక్కడం మొదలు పెట్టింది. దానితో యాదవ్ కారు నుండి ఫోన్ ను బయటకు విసిరేసాక, రోడ్ పై పడిన వెంటనే ఐ ఫోన్ పేలిపోయింది. ఇది జరిగినప్పుడు ఫోన్ 70 శాతం బ్యాటరీ బ్యాక్ అప్ తో ఉంది.
60,000 పెట్టి 64జిబి స్పేస్ గ్రే వెర్షన్ గత గురువారం,జూన్ 18 న ఫోన్ కొన్నారు యాదవ్. ఆపిల్ సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లగా ఆపిల్ కంప్లయింట్ రిజిస్టర్ చేయుటకు నిరాకరించింది. అయితే పేలిన ఫోన్ సామగ్రిని వాళ్లకు ఇవ్వమని అడిగారు. అయితే యాదవ్ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్ చేశారు.
ఈ విషయం పై ఆపిల్ ఇండియా గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటాము అని చెప్పింది. అయితే ఇలాగే US లో ఫిలిప్ అనే ఐ ఫోన్ యూజర్ కు ఫోన్ 90 డిగ్రీలు వరకూ వేడెక్కి పేలిపోయింది. అతనికి సెకెండ్ డిగ్రీ బర్నింగ్స్ కూడా అయ్యాయి.
ఆధారం: TOI