2016 లో ఆపిల్ ఐ ఫోన్ 5S అఫీషియల్ గా 21,000 rs కు పడి పోయింది. అయితే చాలా మంది దీనిని తీసుకోవాలా వద్దా అని సంశయిస్తున్నారు. వారి కోసం ఈ ఆర్టికల్.
- మీరు చిన్న స్క్రీన్ ఫోన్ వాడటానికి ఇబ్బంది పడరా? అవును అయితే తీసుకోవచ్చు. అయితే ఆపిల్ పై మోజు తో స్టార్టింగ్ లో చిన్న స్క్రీన్ ఫర్వాలేదు అనుకున్నా తరువాత మరలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనేది మీకు తెలిసి తీరాలి.
- స్పీడ్ వైజ్ గా మీరు 80 నుండి 90 శాతం satisfy అవుతారు. మిగిలిన percentage ఎందుకు అంటే విపరీతంగా గేమ్స్ మరియు యాప్స్ ఇంస్టాల్ చేస్తే కొంచెం యాప్ లోడింగ్ కు time తీసుకుంటున్నట్లు డిఫరెన్సు గమనిస్తారు.
- బైటరీ. ఇది అసలు విషయం. అయితే బ్యాటరీ మార్కింగ్ 9 గం ప్రాంతంలో ఛార్జింగ్ పెడితే, రాత్రి 7 నుండి 9 వరకూ వస్తుంది ఏవరేజ్ usage లో. గేమ్స్ ఆడితే మాత్రం మధ్యాహ్నం 4 గంటల లోపే అయ్యిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ బైటరీ విషయంలో ఐ ఫోన android కన్నా బెటర్. మీరు ఏమి వాడకుండా ఫోన్ లో పెట్టుకుని ఉంటే (stand by time) చాలా బాగుంటుంది. 100 % నుండి ఒక్క percent కూడా డ్రాప్ అవ్వదు స్టాండ్ బై లో. ఇది రాత్రి మీరు పెట్టి ఉదయం లేచి చూసిన అలానే ఉండే సందర్భాలు చూస్తారు. అయితే మీరు ఫోన్ కొంచెం బ్యాటరీ ను హరించే రేర్ యాప్స్ వాడితే పడుతుంది. అది వేరే విషయం.
- iOS విషయానికి వస్తే, చాలా neat అండ్ క్లాస్ గా ఉంటుంది. కాల్స్ ను ఇతర యాప్స్ ఏమీ ఇంస్టాల్ చేయకుండానే బ్లాక్ చేయగలరు, మొబైల్ నుండి లాప్ టాప్ ను హాట్ స్పాట్ ఇంటర్నెట్ వాడుకోగలరు.
- ఆపిల్ రిలీజ్ చేసే ప్రతీ అప్ డేట్ ను ఆస్వాదించగలరు రిలీజ్ రోజే.
- హాండ్ సెట్ ప్రీమియం గా ఉంటుంది. ఆడియో లౌడ్ గా ఉంటుంది.
- ఫ్రీ యాప్స్ అండ్ గేమ్స్ బాగానే ఉంటాయి. అయితే android కన్నా దీనిలో ఎక్కువుగా paid యాప్స్ కనిపిస్తాయి.
ఐ ఫోన్ బ్యాటరీ ను ఎలా సేవ్ చేసుకోవాలో కొన్ని indepth టిప్స్ కావాలంటే కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి, దానిపై ఆర్టికల్ వ్రాస్తాము.