Apple Intelligence తో వచ్చిన iPhone 16 మరియు 16 Plus ఇండియా ప్రైస్ తెలుసుకోండి.!

Apple Intelligence తో వచ్చిన iPhone 16 మరియు 16 Plus ఇండియా ప్రైస్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Apple Intelligence సపోర్ట్ తో కొత్త ఐఫోన్ లను విడుదల చేసింది

iPhone 16 మరియు 16 Plus లను సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో అందించింది

ఈ రెండు కొత్త యాపిల్ ఐఫోన్ లు కూడా A18 Bionic చిప్ సెట్ తో పని చేస్తాయి

Apple Intelligence సపోర్ట్ తో కొత్త ఐఫోన్ లను విడుదల చేసింది. యాపిల్ 16 సిరీస్ బేసిక్ ఫోన్స్ అయిన iPhone 16 మరియు 16 Plus లను సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో అందించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో AI ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతుంటే, యాపిల్ ఇప్పుడు ఈ ఫీచర్ ను యాపిల్ ఫోన్ లలో కూడా పరిచయం చేసింది. అయితే, యాపిల్ లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది. ఎందుకంటే, యాపిల్ ఇంటెలిజెన్స్ చాలా పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఉంటుంది.

ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకునే ముందు ఈ ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ కొత్త ధరల వివరాలు చూద్దాం.

Apple iPhone 16 : ధర

ఐఫోన్ 16 (128GB) వేరియంట్ ధర : రూ. 79,990

ఐఫోన్ 16 (256GB) వేరియంట్ ధర : రూ. 89,990

ఐఫోన్ 16 (512GB) వేరియంట్ ధర : రూ. 1,09,990

Apple iPhone 16 Plus : ధర

ఐఫోన్ 16 ప్లస్ (128GB) వేరియంట్ ధర : రూ. 89,990

ఐఫోన్ 16 ప్లస్ (256GB) వేరియంట్ ధర : రూ. 99,990

ఐఫోన్ 16 ప్లస్ (512GB) వేరియంట్ ధర : రూ. 1,19,990

Apple iPhone 16 మరియు iPhone 16 : ఫీచర్లు

యాపిల్ ఈ ఐఫోన్ బేసిక్ ఫోన్ లను సైతం Apple Intelligence సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ లతో పోలిస్తే ఇది అతిపెద్ద అప్గ్రేడ్ అవుతుంది. ఐఫోన్ 16 ఫోన్ లో 6.1 ఇంచ్ Super Retina XDR (OLED) స్క్రీన్ వుంది మరియు ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ లో 6.7 ఇంచ్ బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఈ రెండు స్క్రీన్ లు కూడా Dolby Vision మరియు HDR 10+ ప్లే సపోర్ట్ ను కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ లు అవుట్ డోర్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1600 నిట్స్ HDR పీక్ బ్రైట్నెస్ తో వస్తాయి. ఈ ఫోన్ ల్లో కూడా డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ను అందించింది.

iPhone 16 And iPhone 16 Plus India Price

ఈ రెండు కొత్త యాపిల్ ఐఫోన్ లు కూడా A18 Bionic చిప్ సెట్ తో పని చేస్తాయి మరియు ఇది 3nm చిప్ సెట్. ఈ చిప్ సెట్ 16- కోర్ న్యూరల్ న్యూరల్ ఇంజిన్ తో పని చేస్తుంది. ఇందులో 6 కోర్ CPU మరియు 5 కోర్ GPU లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లలో సేఫ్టీ పరంగా క్రాష్ డిటెక్షన్ మరియు ఎమర్జెన్సీ SOS ఫీచర్లను కలిగి వుంది. ఈ రెండు ఫోన్లు కూడా పేస్ ఐడి రికగ్నైజేషన్ ఫీచర్ ను కలిగి ఉన్నాయి.

ఇక కెమెరా డీటెయిల్స్ లోకి వెళితే, ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 రెండు ఫోన్లు కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఇందులో OIS సపోర్టెడ్ 48MP మెయిన్ సెన్సార్ మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 2X ఆప్టిక్ జూమ్ తో వస్తుంది. ఈ కెమెరా ఆప్టికల్ జూమ్ మరియు 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న 12MP అల్ట్రా వైడ్ సెన్సార్, మ్యాక్రో సెన్సార్ గా కూడా పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4K రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 12MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

Also Read: Apple iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఇండియా ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

ఇక ఈ ఫోన్స్ కెమెరా ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ రెండు ఫోన్లు కూడా 24 fps, 25 fps, 30 fps or 60 fps వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ తో వస్తాయి. ఈ ఫోన్స్ కెమెరాతో Dolby Vision HDR 4K వీడియో రికార్డింగ్ ను 60 FPS వద్ద షూట్ చేయవచ్చని యాపిల్ తెలిపింది.

ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ లను రోజంతా పనిచేయగల బ్యాటరీ బ్యాకప్ తో అందించినట్లు యాపిల్ ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు కూడా యాపిల్ కొత్తగా ప్రకటించిన iOS 18 పై నడుస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo