iPhone 15 launched: సూపర్ కెమేరాతో iPhone 14 రేటుకే లాంచ్| what’s new
ప్రపంచం మొత్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న iPhone 15 Series లాంచ్ అయ్యాయి
iPhone 15 Series ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయి
iPhone 15 ను యాపిల్ కేవలం iPhone 14 రేటుకే లాంచ్ చేసి ఆశ్చర్య పరిచింది
ప్రపంచం మొత్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న iPhone 15 Series లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల గురించి గత కొన్ని నెలలుగా అనేక రూమర్లు, అంచనాలు మరియు టెక్ ఫీచర్స్ గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే, ఎట్టకేలకు నిన్న రాత్రి 10:30 నిముషాలు iPhone 15 Series ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. ఇందులో బేసిక్ వేరియంట్ iPhone 15 ను యాపిల్ కేవలం iPhone 14 రేటుకే లాంచ్ చేసి ఆశ్చర్య పరిచింది. iPhone 15 Specs, ఫీచర్స్ మరియు Price వివరాలను కంప్లీట్ గా తెలుసుకుందాం పదండి.
How much does iPhone 15 cost?
iPhone 15 ఫోన్ ను యాపిల్ మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇండియాలో Apple iPhone 15 ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
1. iPhone 15 (128GB) Price : Rs. 79,900
2. iPhone 15 (256GB) Price : Rs. 89,900
3. iPhone 15 (512 GB) Price : Rs. 109,900
iPhone 15 Pre-order
iPhone 15 ఫోన్ యొక్క Pre-order లను 15 September సాయంత్రం 5:30 PM నుండి ప్రారంభిస్తుంది మరియు 22 September నుండి ఈ ఐఫోన్ 15 సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
iPhone 15 colors
iphone 15 ఫోన్ 5 కలర్ అప్షన్ లలో లభిస్తుంది. అవి: Blue, Pink, Yellow, Green మరియు Black
iPhone 15 specs
ఐఫోన్ 15 ఫోన్ కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ బ్యాక్ కలిగిన Aluminium ఫ్రేమ్ తో వస్తుంది. ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ Super Retina XDR (OLED)డిస్ప్లేతో వస్తుంది. iPhone 14 Series హై ఎండ్ వేరియంట్ లో గత సంవత్సరం పరిచయం చేసిన Dynamic Island ను ఈసారి iPhone 15 లో బేసిక్ ఫోన్ కూడా యాపిల్ అందించింది. ఐఫోన్ 15 ఫోన్ 5-core GPU తో కూడిన A16 Bionic chip తో పనిచేస్తుంది.
iPhone 15 Camera విషయానికి వస్తే, ఈసారి కొత్త ఫోన్లలో యాపిల్ మంచి అప్గ్రేడ్ నే అందించింది. ఈ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ వద్ద గతంలో వచ్చిన ఐఫోన్ 14 కంటే పెద్ద అప్గ్రేడ్ ను అందుకుంది. ఐఫోన్ 15 ఫోన్ లో 48MP Main మరియు 12MP Ultra Wide సెన్సార్ లను అందించింది. Focus and Depth కంట్రోల్స్ తో గొప్ప Hi-res ఫోటోలను తియ్యగలదని 4x optical zoom range తో కూడా ఉంటుంది. ఐఫోన్ 15 కెమేరాతో 4K video recording ను 60fps వరకూ రికార్డ్ చేయగలదు మరియు Cinematic mode up to 4K HDR at 30 fps ఫీచర్ తో కొద వస్తుంది.
ఈ ఫోన్ లో కూడా అత్యంత ఉపయోగకరమైన Crash Detection Emergency SOS ఫీచర్ ను జత చేసింది. యాపిల్ ఫోన్ లను యూజర్లకు మరింత చేరువగా చేయడం కోసం USB‑C ఛార్జ్ పోర్ట్ సపోర్ట్ ను Apple అందించింది. ఈ ఫోన్ IP68 Rated తో Splash, Water మరియు Dust Resistant గా ఉంటుంది.