iPhone 15 ఫోన్ యొక్క అసెంబ్లింగ్ ఇండియాలో జరుగుతుందని తెలుస్తోంది. అంతేకాదు, Foxconn, Luxshare మరియు Pegatron తరువాత ఇప్పుడు TATA Group కూడా ఇందులో భాగం పంచుకోనున్నది, కొత్త నివేదికలు బల్ల గుద్ది చెబుతున్నాయి. ఇండియాలో పెరుగుతున్న iPhone అమ్మకాలను గుర్తించిన యాపిల్, ఫోన్ అసెంబుల్ ని ఇండియాలో చేపట్టటం ద్వారా ఫోన్ రేట్స్ పైన మరింత ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవలే, ఇండియాలో Apple Store లను కూడా కంపెనీ ఒపెన్ చేసింది.
ఇక కొత్త నివేదికలను పరిశీలిస్తే, ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ కోసం Foxconn, Luxshare, Pegatron మరియు TATA Group నాలుగు అసెంబ్లర్ లను సూచిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు ఈ కంపెనీల ఆర్డర్ వివరాల గురించి కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. TrendForce ఐఫోన్ 15 యొక్క రీ లొకేషన్ ను గురించి కూడా చర్చింది.
TATA అతిపెద్ద మరియు అత్యంత ప్రతిష్టాత్మమైన కంపెనీగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి వుంది. కాబట్టి, సహజంగానే ఈ కంపెనీకి ఐఫోన్ 15 సిరీస్ కోసం గరిష్ట ఆర్డర్స్ ను సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఇప్పటికే నివేదికలు రకాల అంచనాలను వేయడం మొదలు పెట్టాయి. కొందరు టాటా గ్రూప్ మినిమం ఆర్డర్స్ ను అందకుంటుందని చెబుతుంటే, మరికొందరు టాటా నే మ్యాగ్జిమమ్ ఆర్డర్ లను పొందవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఇదంతా అంచనా మాత్రమే, అధికారిక ప్రకటన తరువాతే అసలు విషయం తెలుస్తుంది.