SailFish OS తో ఇంటెక్స్ కొత్త ఫోన్
ఇదే మొదటి ఇంటెక్స్ డిఫరెంట్ OS స్మార్ట్ ఫోన్
Shanghai లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో గురువారం ఇంటెక్స్ మొదటి Sailfish os 2.0 తో స్మార్ట్ ఫోన్ unveil చేయనుంది. Linux మీద పనిచేసే Sailfish os 2.0 Jolla మేకర్ ద్వారా అనౌన్స్ చేయబడింది ఈ సంవత్సరం.
Shanghai ఈవెంట్ లో డెమో డివైజ్ కూడా చూపించబడింది. అయితే అది అసలు ఫోన్ కాదు, కేవలం డెమో మోడల్ అని ఇంటెక్స్ చెప్పటం తో ఇప్పుడు విడుదల కాబోయే మోడల్ పై అందరూ ఎదురుచూస్తున్నారు. దీనిలో 4G సుపిరియర్ gesture కంట్రోల్స్, బెటర్ UI, ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ ఉంది.
స్పెసిఫికేషన్స్ మరియు ప్రైస్ పై ఇంకా ఎటువంటి న్యూస్ రాలేదు. అయితే కొన్ని సోర్సస్ ప్రకారం , దీని పేరు Intex Aqua Fish. దీనిలో స్నాప్ డ్రాగన్ 400, 410 లేదా 600 SoC ఉండనుంది. 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB అదనపు స్టోరేజ్ సపోర్ట్.
ఇండియాలో ఇది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు ఇంటెక్స్ MWC లో స్మార్ట్ వాచ్ కూడా unveil చేయనుంది. దీని పేరు iRist అని రిపోర్ట్స్.