ఇంటెక్స్ తన మొదటి 4జి స్మార్ట్ ఫోన్ ను 9,499 రూ లకు Aqua 4G+ పేరుతో లాంచ్ చేసింది. అన్ని రిటైల్ స్టోర్స్ లో ఇది దొరకనుంది.
దీని స్పెసిఫికేషన్స్- 5 in HD డ్రాగన్ ట్రైల్ గ్లాస్ డిస్ప్లే, మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సదుపాయం, ఆండ్రాయిడ్ లాలిపాప్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, బ్లూటూత్, వైఫై, 13 MP మరియు 5MP కేమేరాస్ (లైవ్ కెమేరా ఫిల్టర్ తో పాటు ఫ్రంట్ మరియు బ్యాక్ కెమేరాలు PIP మోడ్ మరియు స్లో మోషన్ వీడియోను సపోర్ట్ చేస్తున్నాయి), 2300 mah బ్యాటరీ, 21 ఇండియన్ భాషలు సపోర్ట్ ఉన్నాయి ఇంటెక్స్ Aqua 4జి ప్లస్ లో. వైట్ మరియు బ్లాక్ కలర్స్ లో లభ్యం అవుతుంది ఈ మోడల్.
ప్రారంభ ఈవెంట్ లో ఇంటెక్స్ మొబైల్ బిజినెస్ హెడ్, సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. " స్మార్ట్ డిజైనింగ్, అందుబాటులోని ధర మరియు యూత్ఫుల్ కలర్స్ లో టార్గెటెడ్ కన్స్యుమర్స్ కు ఇది మంచి హాండ్ సెట్ అవుతుంది" అని అన్నారు. ఏప్రిల్ నెలలో ఇంటెక్స్ క్లౌడ్ M6 పేరుతో ఒక బడ్జెట్ ఫోన్ ను 5,699 రూ లకు ఇండియాలో లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్స్ – 5 in (854×480 పిక్సెల్స్) డిస్ప్లే, 1.2 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, 8జిబి ఇంబిల్ట్ మరియు అదనపు స్టోరేజ్ సపోర్ట్, 8MP ఆటో ఫోకస్ 5MP ఫ్రంట్ కెమెరా లు ఉన్నాయి ఇందులో. ఈ హాండ్ సెట్ కూడా వైట్ మరియు బ్లాక్ కలర్స్ లో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో దొరికే ఈ మొబైల్ కు 2000 mah బ్యాటరీ జోడించింది ఇంటెక్స్.