ఇంటెక్స్ ఆక్వా 4G మినీ ఆల్ట్రా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 25-Mar-2017
HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క ధర చూసినట్లయితే కేవలం Rs.4,199

ఇంటెక్స్  ఆక్వా  4G  మినీ  ఆల్ట్రా బడ్జెట్  స్మార్ట్  ఫోన్  లాంచ్ 

ఇంటెక్స్  కంపెనీ నుంచి ఒక   ఆక్వా  4G  మినీ  ఆల్ట్రా బడ్జెట్  స్మార్ట్  ఫోన్  లాంచ్ చేయబడింది.  ఈ ఫోన్ యొక్క ధర  చూసినట్లయితే కేవలం Rs.4,199 , మరియు  ఈ సరికొత్త మినీ  ఆక్వా ఆల్ట్రా బడ్జెట్  స్మార్ట్  ఫోన్ ఎప్పుడు లాంచ్  అవుతుందనేది  కంపెనీ ఇంకా  అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఫోన్  బ్లాక్  మరియు  రెడ్  కలర్స్ లో  అందుబాటులో వుంది. ఇంటెక్స్  ఆక్వా 4G మినీ  లో  4.0 ఇంచ్  FWVGA డిస్ప్లే ఇవ్వబడింది. ఈ  డివైస్ లో  1.3GHz క్వాడ్  కోర్  ప్రాసెసర్  అమర్చారు . ఈ డివైస్  లో  512MB ర్యామ్  వుంది . ఆండ్రాయిడ్  మార్ష్మల్లో 6.0మీద  పని  చేస్తుంది. 
మరియు  ఈ డివైస్ లో 1450mAh లియోన్ బ్యాటరీ ఉంది , 6 గంటలు  టాక్  టైం  ఇస్తుంది.బ్యాటరీ స్టాండ్బై సమయం 250 గంటలు . ఇంటర్నల్ స్టోరేజ్  4GB ని  32GB వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.  . 

ఈ డివైస్  లో  కెమెరా  5 మెగా  పిక్సెల్  మరియు సెకండరీ  కెమెరా  0.3 మెగా  పిక్సెల్  వుంది. . ఆక్వా  4G మినీ  డ్యూయల్  సిం ఫోన్ ,వైఫై , 4G, వైఫై  (802.11 b/g/n),బ్లుటూత్  2.1/4.0, GPS/AGPS, మైక్రో  USB పోర్ట్ , వంటి ఫీచర్స్  కలిగి వుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :