InFocus అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పేరు కొత్తదే కాని బడ్జెట్ లో మంచి స్పెక్స్ తో ఇంతకుముందు రెండు మోడల్స్ (M2 మరియు M330) ను లాంచ్ చేసి స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు బాగా పరిచయం అయ్యింది. అయితే ఇప్పుడు ఇన్ ఫోకస్ M350 మరియు M530 పేరుతో మరో రెండు మోడల్స్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది.
ఇన్ ఫోకస్ M350 స్పెసిఫికేషన్స్ – కర్వ్ డిజైన్ ప్లాస్టిక్ బ్యాక్ ఉంది దీనికి. 5 in 720 x 1280 పిక్సెల్స్ HD IPS డిస్ప్లే. మీడియా టెక్ MT6732 1.5 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2జిబి ర్యామ్, ఫ్రంట్ మరియు బ్యాక్ 8MP కేమేరాస్.
M350 ను మొదటి సారి పట్టుకున్నప్పుడు చేతిలో కంఫర్ట్ గా అనిపించింది వెనుక ఉన్న కర్వ్ డిజైన్ వలన. కాని స్క్రీన్ మాత్రం కొంచెం డల్ గా కనిపిస్తుంది. డిస్ప్లే కలర్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. InFocus M350 ధర 7,999 రూ.
ఇన్ ఫోకస్ M530 స్పెసిఫికేషన్స్ – ఇది M350 మోడల్ కి వ్యతిరేకంగా చేతిలో బల్కీ గా ఉంది ఓవర్ ఆల్ బాడీ. దీనిలో 5.5 in 720 x 1280 పిక్సెల్స్ HD IPS డిస్ప్లే. M350 మోడల్ వలె దీనికి కూడా డిస్ప్లే కలర్స్ మరియు షార్ప్ నేస్ కొంచెం తక్కువుగా ఉంది.
Infocus M530 బ్యాక్ కెమేరా తో తీసిన ఫోటోగ్రాఫ్ ఇది.
మీడియా టెక్ MT6595 ఆక్టో కోర్ 2GHz SoC, 2జిబి ర్యామ్, 13MP బ్యాక్ మరియు ఫ్రంట్ కేమేరాస్. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS) f/1.8 అపెర్చర్. దీనితో మేము గడిపిన అతి తక్కువ సమయంలో ఇది చాలా మంచి ఫొటోలను తీసింది. త్వరలోనే దీని పూర్తి కెమేరా పనితనం గురించి తెలుసుకుంటాము. దీని ధర 10,999 రూ.
InFocus M530 మోడల్ జూన్ 26 న ఓపెన్ సేల్ అవుతుంది కాని InFocus M350 మోడల్ కోసం ప్రీ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రోసెస్ ఓపెన్ లో ఉంది. రెండు మోడల్స్ స్నాప్ డీల్ లో సేల్ అవనున్నాయి.