రేపు లాంచ్ కాబోతున్న Infinix Zero Flip ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
Infinix Zero Flip స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను ఇన్ఫినిక్స్ వెల్లడించింది
Zero Flip ను గొప్ప ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది
Infinix Zero Flip స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి కంటే ముందుగా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన క్లీన్ డిజైన్, Ai సపోర్ట్ మరియు గొప్ప కెమెరా సెటప్ వంటి మరిన్ని గొప్ప ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది. రేపు విడుదల కాబోతున్న ఈ ఇన్ఫినిక్స్ ఫ్లిప్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి.
Infinix Zero Flip : ఫీచర్స్
ఇన్ఫినిక్స్ ఈ ఫ్లిప్ ఫోన్ ను రౌండ్ కార్నర్ మరియు స్ట్రాంగ్ హింజ్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో అందించిన హింజ్ 4,00,000 లకు పైగా ఫోల్డ్ ను తట్టుకొని నిలబడుతుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అంటే, ఈ ఫోన్ ను ఎక్కువ సార్లు మధ్యకు మడత పెట్టినా తట్టుకొని నిలబడుతుందని హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ ఈ ఫోన్ ను 30 డిగ్రీల నుంచి 150 డిగ్రీల వరకు ఏ యాంగిల్ లో అయినా ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8020 5G చిప్ సెట్, 16GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4720 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫ్లిప్ ఫోన్ UTG ప్రొటెక్షన్ కలిగిన మడత పెట్టగలిగే 6.9 ఇంచ్ LTPO స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. అలాగే, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 3.64 ఇంచ్ AMOLED వెలుపలి స్క్రీన్ కూడా ఉంటుంది.
Also Read: నథింగ్ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ CMF Phone 1 పైన ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్.!
ఈ ఫోన్ గొప్ప కెమెరా సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP (OIS) మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరాలతో 60 fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ Ai ఇన్ఫినిటీ ఫీహ్ర తో వస్తుంది మరియు చాలా AI ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.