ఇన్ఫినిక్స్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. అదే, Infinix Zero 40 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో 4K 60FPS కెమెరాతో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి, ఇటీవలే 10 వేల ఉప బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ విడుదల చేసింది. ఇప్పుడు కూడా అదే దూకుడుతో ఈ అప్ కమింగ్ ఫోన్ ను తీసుకువస్తోంది.
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తుంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తున్న ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్టనర్ గా ఎంచుకుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిజైన్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో లంచ్ చేస్తోంది. ఈ ఫోన్ 7.9 mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు 196 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ రాక్ బ్లాక్, మూవింగ్ టైటానియం మరియు వయోలెట్ గార్డెన్ మూడు కలర్ లలో లాంచ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో అందించిన కెమెరా సిస్టం గురించి ఇన్ఫినిక్స్ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ మరియు బొకే సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. చీకట్లో సైతం ఈ కెమెరాతో గొప్ప ఫోటోలు మరియు వీడియోలను షూట్ చేయడానికి వీలుగా ఫ్లాష్ లైట్ మరియు జూమ్ ఫ్లాష్ లైట్ ను కూడా అందించింది.
Also Read: Amazon Great Indian Festival Sale అనౌన్స్ చేసిన అమెజాన్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.!
ఇక ఈ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కెమెరాతో 60FPS వద్ద స్టేబుల్ 4K వీడియోలు షూట్ చేయవచ్చని తెలిపింది. ఈ కెమెరాని ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో AI ఎరేజర్, AI సెర్చ్, AI కట్ అవుట్ వంటి మరిన్ని AI ఫీచర్స్ ను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ 4K Ultra HD GoPro తో కూడా పని చేస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.