Infinix Zero 30 5G: 4K Video రికార్డ్ సెల్ఫీ కెమేరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫీచర్లు తెలుసుకోండి.!

Infinix Zero 30 5G: 4K Video రికార్డ్ సెల్ఫీ కెమేరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ 4K Video రికార్డ్ సెల్ఫీ కెమేరాతో లాంచ్

12GBRAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ తో బడ్జెట్ ధరలో వచ్చింది

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 3D Curved AMOLED డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది

ఈరోజు ఇండియన్ మార్కెట్ లో Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ 4K Video రికార్డ్ సెల్ఫీ కెమేరాతో లాంచ్ అయ్యింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో నడుస్తున్న Curved Display తో వచ్చింది. Infinix Zero 30 5G ను కంపెనీ చాలా కాలంగా టీజ్ చేసింది మరియు ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఒక్క కెమేరా, డిస్ప్లే విభాగాల్లోని కాకుండా మరిన్ని విభాగాల్లో మంచి ప్రత్యేకతలను కలిగి వుంది. Infinix Zero 30 5G యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. 

Infinix Zero 30 5G Price 

ఇన్ఫినిక్స్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రూ. 23,999 ధరతో భారత్ లో లాంచ్ చేసింది. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజ్ కోసం నిర్ణయించిన ధరైతే 12GBRAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 24,999 ధరలో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ పైన ఇన్ఫినిక్స్ గొప్ప లాంచ్ అఫర్ లను కూడా జత అందించింది మరియు ఈ ఫోన్ Pre-Orders మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. Infinix Zero 30 5G ఫోన్ ను Axis Bank క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ తగ్గింపు అందుతుంది. 

Infinix Zero 30 5G Specs 

ఇన్ఫినిక్స్ జీరో 30 5జి స్మార్ట్ ఫోన్ ను అద్భుతమైన డిజైన్ తో అందించింది ఇన్ఫినిక్స్. జీరో 30 స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ లో ప్రీమియం లుక్ తో వచ్చిన ఫోన్ మరియు ఈ ఫోన్ వేగాన్ లెథర్ తో ప్రీమియం ఫీల్ అందిస్తుంది. జీరో 30 స్మార్ట్ ఫోన్ 6.78 FHD+ 3D Curved AMOLED డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి వుంది.

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ ప్రస్తుతం ఈ ప్రైస్ రేంజ్ లో మార్కెట్లో ఉన్న ఫోన్ లకు గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 8020 SoC కి జతగా 12GB RAM ను కూడా కలిగి వుంది. అంతేకాదు, ఈ ప్రైస్ రేంజ్ లో భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. 

Infinix Zero 30 5G Camera విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 108MP OIS (Samsung ISOCELL HM6) మెయిన్ సెన్సార్ + 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ + 2MP సెన్సార్ ఉన్నాయి. అలాగే, ముందు భాగంలో  50MP (Samsung ISOCELL JN1) సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ జీరో 30 5G ఫోన్ కెమేరా యొక్క  బ్యాక్ కెమేరా మరియు సెల్ఫీ కెమేరా కూడా  4K వీడియోలను 60 fps వద్ద రికార్డ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.  

ఇన్ఫినిక్స్ జీరో 30 5జి ఫోన్ DTS Audio సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు, IP53 Splash Proof మరియు DAR-Link గేమ్ బూస్ట్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్స్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జ్ ని PD 3.0 సపోర్ట్ అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo