Upcoming Mobile: 7 వేల లోపలే అదిరిపోయే ఫోన్ తెస్తున్న ఇన్ఫినిక్స్.!
7 వేల లోపలే అదిరిపోయే ఫోన్ తెస్తున్న ఇన్ఫినిక్స్
అప్ కమింగ్ ఫోన్ ఫీచర్లతో పాటుగా అంచనా ధరతో కూడా టీజింగ్ చేస్తోంది
Infinix Smart 8 లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
Upcoming Mobile: 7 వేల లోపలే అదిరిపోయే ఫోన్ తెస్తున్న ఇన్ఫినిక్స్. ఈ మాట నేను చెప్పటం లేదు, ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ టీజింగ్ చెబుతోంది. మాములుగా ఫోన్ ఫీచర్లు మరియు కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేయడం అనాదిగా వస్తున్న విషయం. అయితే, ఇన్ఫినిక్స్ ఒకడుగు ముందుకు వేసి, అప్ కమింగ్ ఫోన్ ఫీచర్లతో పాటుగా అంచనా ధరతో కూడా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి ఇన్ఫినిక్స్ ఏమి చెబుతోందో చూద్దాం రండి.
Infinix Upcoming Mobile
ఇన్ఫినిక్స్ బ్రాండ్ తన అప్ కమింగ్ బడ్జెట్ 4జి స్మార్ట్ ఫోన్ Infinix Smart 8 ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ మరియు టైమ్ ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా తీసుకు వస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.
Infinix Smart 8 Expected Price
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ధరను కంపెనీ ముందుగానే వెల్లడించింది. ఈ ఫోన్ ను రూ. 6,XXX ధరలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అంచనా ధరను అందించింది. అంటే, ఎంత ఎక్కువగా వేసుకున్నా, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్ 7 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది.
Also Read : Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు కూడా తగ్గిన గోల్డ్ రేట్.!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 టీజ్డ్ స్పెక్స్
ఇక ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ లో ఆకట్టుకునే స్పెక్స్ మరియు ఫీచర్లు ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఈ ధర పరిధిలో చాలా అందమైన డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ ను 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిపింది. ఇందులో పోర్ట్ రైట్ మోడ్, AR Shot మరియు HDR మోడ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ ను సన్నని అంచులు మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.6 ఇంచ్ HD డిస్ప్లేతో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో మ్యాజిక్ రింగ్ నోటిఫికేషన్ బార్ ఫీచర్ కూడా ఉందని టీజర్ లో పేర్కొంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ తో కూడా వస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 8GB వరకూ RAM ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందిస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను లాంచ్ కంటే ముందుగా వెల్లడించనున్నట్లు కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది.