Infinix SMART 9 HD: 6 వేల బడ్జెట్ లో పెద్ద స్క్రీన్, బ్యాటరీ మరియు డ్యూయల్ స్పీకర్లతో వచ్చింది.!
ఇన్ఫినిక్స్ ఈరోజు Infinix SMART 9 HD స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో ఫోన్ ను లాంచ్ చేసింది
ఈ ఫోన్ 6 వేల బడ్జెట్ లో పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బ్యాటరీతో వచ్చింది
Infinix SMART 9 HD: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న కంపెనీగా యూజర్ల వద్ద పేరు తెచ్చుకున్న ఇన్ఫినిక్స్ ఈరోజు కేవలం 6 వేల బడ్జెట్ సెగ్మెంట్ పెద్ద స్క్రీన్, బ్యాటరీ మరియు డ్యూయల్ స్పీకర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.
Infinix SMART 9 HD: ప్రైస్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,699 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ను Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Infinix SMART 9 HD: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్ ఫోన్ వేలి ముద్ర మరియు గీతలు పడని స్మడ్జ్ ఫ్రీ గ్లాస్ బ్యాక్ మరియు గట్టి నిర్మాణంతో అందించింది. ఈ ఫోన్ 2,50,000 సార్లు డ్రాప్ టెస్ట్ లో విజయం సాధించిందని కూడా ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగిన 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 90Hz రిజల్యూషన్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ 13MP + AI లెన్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. స్మార్ట్ 9 HD ఫోన్ డైనమిక్ బార్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G50 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 3GB ఫిజికల్ ర్యామ్, 3GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
Also Read: Air Cooler Deals: గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ కూలర్స్.!
ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్ సెటప్ ను DTS సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా అందించింది. ఈ ఫోన్ Android 14 Go పై నడుస్తుంది మరియు IP54 రేటింగ్ తో డస్ట్ మరియు స్ప్లాష్ ప్రూఫ్ గా ఉంటుంది.