Infinix Smart 8 Plus: 7 వేలకే ఐఫోన్ లాంటి ఫీచర్ తో కొత్త ఫోన్ వస్తోంది.!
భారత్ మార్కెట్ లో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లు లాంఛ్ అవుతున్నాయి
Infinix Smart 8 Plus 7 వేలకే ఐఫోన్ లాంటి ఫీచర్ తో కొత్త ఫోన్ వస్తోంది
ఈ ఫోన్ భారీ 6000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ తో వస్తోంది
2024 సంవత్సరం ప్రారంభం నుండి కూడా భారత్ మార్కెట్ లో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లు లాంఛ్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువగా 10 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో వచ్చే స్మార్ట్ ఫోన్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరోక స్మార్ట్ ఫోన్ కూడా లాంఛ్ కు సిద్దమయ్యింది. బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న బ్రాండ్ గా పేరొందిన ఇన్ఫినిక్స్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంఛ్ అవుతోంది. Infinix Smart 8 Plus పేరుతో లాంఛ్ కాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7 వేలకే ఐఫోన్ లాంటి ఫీచర్ తో కొత్త ఫోన్ వస్తోంది.
Infinix Smart 8 Plus launch
1 March 2024 తేదిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ అనౌన్స్ మెంట్ టీజర్ తో పాటుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను కూడా అందించింది. అంతేకాదు, లాంఛ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క ప్రైస్ తో టీజింగ్ కూడా చేస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ని రూ. 6,XXX ధరతో లాంఛ్ చేయనున్నట్లు టీజింగ్ ద్వారా తెలిపింది. అంటే, ఎంత ఎక్కువ వేసుకున్నా 7 వేల కంటే తక్కువ ధరలోనే లాంఛ్ చేస్తుందని, ఇన్ఫినిక్స్ కన్ఫర్మ్ చేసింది.
Also Read: 64MP Sony సెన్సార్ ట్రిపుల్ కెమేరాతో వస్తున్న Lava Blaze Curve స్మార్ట్ ఫోన్.!
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ప్రత్యేకతలు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కంపెనీ ఇప్పటికే బయట పెట్టింది. ఈ ఫోన్ ను పంచ్ హోల్ రిజైన్ మరియు సన్నని అంచులు కలిగిన HD డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ లో భారీ 6000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ తో జత చేసినట్లు టీజర్ ద్వారా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ బ్యాటరీ ఎన్ని గంటలు బ్యాకప్ అందిస్తుందో కూడా తెలియ చేసింది.
ఈ ఫోన్ బ్యాటరీ 90 గంటల మ్యూజిక్ లేదా 45 గంటల వీడియో ప్లే బ్యాక్ లేదా 47 గంటల కాలింగ్ ను చేసుకునే అవకాశం అందిస్తుందని కంపెనీ టీజర్ ద్వారా తెలియ చేసింది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క RAM మరియు Storage వివరాలను కూడా ఇన్ఫినిక్స్ ముందే తెలిపింది. ఈ ఫోన్ ను 8GB RAM ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుందని కన్ఫర్మ్ చేసింది.