Infinix Smart 8 HD: 6 వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15 మాదిరి ఫీచర్ ఉన్న ఫోన్ వస్తోంది

Updated on 13-Mar-2024
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్ లోకి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చి చేరబోతోంది

Infinix Smart 8 HD అంచనా రేటుతో హైప్ ను మరింతగా పెంచేసింది

డిసెంబర్ 8వ తేదీ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ డేట్ అనౌన్స్ చేసింది

ఇండియన్ మార్కెట్ లోకి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చి చేరబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, 6 వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15 మాదిరి ఫీచర్ తో ఈ ఫోన్ వస్తోంది. అదే Infinix Smart 8 HD స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 8వ తేదీ భారత మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ డేట్ అనౌన్స్ చేసింది. ముందు నుండే ఈ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ అంచనా రేటుతో హైప్ ను మరింతగా పెంచేసింది.

Infinix Smart 8 HD Price

ఈ ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ మరియు హోమ్ పేజ్ బ్యానర్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కంపెనీ ఈ ఫోన్ యొక్క ధర మరియు కీలకమైన ఫీచర్లను వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ అంచనా ధరను ఇంఫినిక్స్ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ను రూ. 5,XXX ధరతో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ ను 6 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD స్మార్ట్ ఫోన్ ను పెద్ద 6.6 ఇంచ్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరాతో కలిగి వుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ రింగ్ ఫీచర్ ను జత చేసింది ఇన్ఫినిక్స్. ఈ ఫీచర్ ను మ్యాజిక్ రింగ్ గా చెబుతోంది మరియు ఈ ఫీచర్ తో ఈ ఫోన్ ఐఫోన్ డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించేలా చేస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD ఈ బడ్జెట్ ధరలో సైడ్ మోంట్ ఫింగర్ ప్రింట్ కలిగిన మొదటి ఫోన్ గా కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా వుంది. ఈ ఫోన్ ను భారీ 5000 mAh బ్యాటరీ మరియు టైప్-సి పోర్ట్ ఫాస్ట్ ఛార్జ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 64 GB ఇంటర్నల్ మెమొరీ మరియు 2TB వరకు ఎక్స్ ప్యాండబుల్ మెమొరీ అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6GB RAM తో ఉంటుందని కూడా ఇన్ఫినిక్స్ టీజర్ ద్వారా తెలిపింది.

ఈ ఫోన్ ను 4 అందమైన కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇందులో క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ మరియు గెలాక్సీ వైట్ కలర్స్ ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :