ఈరోజు ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. Infinix ఈరోజు ఇండియాలో కేవలం రూ. 5,999 ధరలో Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద, స్క్రీన్, బిగ్ బ్యాటరీ, ర్యామ్ మరియు స్టోరేజ్ వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD స్మార్ట్ ఫోన్ 2GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ. 5,999 మాత్రమే. ఈ ఫోన్ May 4 నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన SBI బ్యాంక్ అఫర్ ను కూడా అందించింది. SBI బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ. 5,399 ధరకే పొందవచ్చని కంపెనీ తెలిపింది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD స్మార్ట్ ఫోన్ 500నిట్స్ పీక్ బ్రెట్ నెస్ కలిగిన 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో ఉంటుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ షూటర్ వుంది. ఈ ఫోన్ Spreadtrum SC9863A1 ఆక్టా కోర్ ప్రోసెసర్ ని 2GB ర్యామ్ మరియు 2GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో కలిగి వుంది.
ఈ ఫోన్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను మెమొరీ కార్డ్ తో 1TB వరకూ స్టోరేజ్ ను పెంచుకునే అప్షన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP+AI సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని పవర్ మారథాన్ టెక్ మరియు నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఇంఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన XOS 12 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది మరియు DTS సౌండ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో వుంది.