Infinix Note 50x 5G+: AIGC పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేస్తోంది
Infinix Note 50x 5G+ AIGC పోర్ట్రైట్ కెమెరాతో వస్తుంది
ఈ ఫోన్ లో 7 ఆకర్షణీయమైన విషయాలు ఉంటాయని ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది
Infinix Note 50x 5G+: ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. అదే ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను AIGC పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజింగ్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ లో అందించే 7 ఆకర్షణీయమైన విషయాలు ఉంటాయని ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది.
Infinix Note 50x 5G+: లాంచ్
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ స్మార్ట్ ఫోన్ ను మార్చి 27న ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుండి. అందుకే, ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది ఆ పేజీ ద్వారా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
Infinix Note 50x 5G+: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7 ఫీచర్స్ తో ఆకట్టుకుంటుందని ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది. ఇందులో కొన్న్ని కీలకమైన ఫీచర్స్ కూడా ఇప్పటికే బయటపెట్టింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Ultimate చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ప్రోసెసర్ మల్టీ టాస్క్ లను చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది.
ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కూడా ఇన్ఫినిక్స్ హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ 90FPS గేమింగ్ కు సపోర్ట్ చేస్తుందట. అంతేకాదు, ఇందులో స్మూత్ గేమింగ్ అనుభూతిని పొందుతారని కూడా ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ లో AIGC పోర్ట్రైట్ కెమెరాని Next – Gen AI సపోర్ట్ తో అందించినట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కెమెరాతో రియర్ టైమ్ అవతార్ లను పొందవచ్చు. అంతేకాదు, AI రైటింగ్ మరియు AI నోట్ వంటి మరిన్ని AI ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.
Also Read: మంచి డిస్కౌంట్ తో 5వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!
ఈ ఫోన్ వెగాన్ లెథర్ ఫినిష్ మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది మరియు 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 5500mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ MIL-STD 8120H సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. అంటే, ఈ ఫోన్ స్టైలిష్ మరియు టఫ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడిస్తుంది.