Infinix Note 50X 5G+: కేవలం రూ. 11,499 ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Infinix Note 50X 5G+: కేవలం రూ. 11,499 ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ గత కాలంగా టీజింగ్ చేస్తున్న Infinix Note 50X 5G+ ఫోన్ ను లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 11,499 ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

Infinix Note 50X 5G+: ఇన్ఫినిక్స్ గత కాలంగా టీజింగ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 11,499 ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, లేటెస్ట్ పవర్ ఫుల్ మీడియాటెక్ 5జి చిప్ సెట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 50X 5G+: ప్రైస్

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ బేసిక్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 11,499 ప్రైస్ ట్యాగ్ తో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 12,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు లాంచ్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ICICI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్. అయితే, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ అందించిన లాంచ్ ఆఫర్ తో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,499 రూపాయల ప్రారంభ ధరకు అందుకోవచ్చు. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart ను సేల్ అవుతుంది.

Also Read: Realme 13 Pro 5G ఎన్నడూ చూడనంత చవక ధరలో సేల్ అవుతోంది.!

Infinix Note 50X 5G+: ఫీచర్స్

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ MIL-STD 810H డ్యూరబిలిటీ కలిగి మంచి పటిష్టమైన డిజైన్ కలిగి ఉంటుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ 6.67 ఇంచ్ HD+ IPS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 672 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు L1 Widevine సపోర్ట్ తో వస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ Dimensity 7300 Ultimate చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 6GB / 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ కొత్త ఫోన్ లో వెనుక 50MP + AI Lens కలిగిన కెమెరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AIGC పోర్ట్రైట్, స్లో మోషన్ మరియు సూపర్ నైట్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ XOS 15 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఇందులో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo