Infinix Note 50s 5G
Infinix Note 50s 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఈ ఫోన్ ఇండియా యొక్క అతి సన్నని 144Hz కర్వుడ్ AMOLED స్క్రీన్ ఫోన్ గా వస్తోంది, అని ఇన్ఫినిక్స్ గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ సైతం టీజర్ పేజి ద్వారా ప్రకటించింది. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది మరియు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
ఇన్ఫినిక్స్ నైట్ 50 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ ఫోన్ ను ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది Flipkart టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
ఇన్ఫినిక్స్ నైట్ 50 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 6.78 ఇంచ్ 144Hz కర్వుడ్ AMOELD స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ఇండియా యొక్క అతి సన్నని కర్వ్డ్ AMOLED డిస్ప్లే కలిగిన ఫోన్ అవుతుందని ఇన్ఫినిక్స్ గొప్ప చెబుతోంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంటుంది.
కేవలం డిస్ప్లే మాత్రమే కాదు ఈ ఫోన్ కూడా చాలా స్లిమ్ గా ఉంటుందని కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక యాక్టివ్ హేలో లైట్ కలిగిన జెమ్ కట్ కెమేరా మోడ్యూల్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 64MP Sony IMX682 ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.
Also Read: LG Smart Tv పై జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!
ఈ ఫోన్ లో JBL డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ నైట్ 50 5జి ప్లస్ స్మార్ట్ ఫోన్ ను మెరైన్ బ్లూ, రూబీ రెడ్ మరియు టైటానియం గ్రే మూడు కలర్ ఆప్షన్ లలో అందిస్తున్నట్లు కూడా ఇన్ఫనిక్స్ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Infinix AI సపోర్ట్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ఏప్రిల్ 14వ తేదీన వెల్లడిస్తుందని కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది.