బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Infinix

బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసిన Infinix
HIGHLIGHTS

12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో Infinix కొత్త 5G ఫోన్ ను లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను 108MP ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ తో కూడా అందించింది

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో అందించింది

ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈరోజు బడ్జెట్ ధరలో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త 5G ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Infinix Note 40X 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 108MP ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్స్ తో కూడా అందించింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Infinix Note 40X 5G : ధర

ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 14,999 ధరతో అందించింది. అలాగే ఈ ఫోన్ రెండవ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 15,999 ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఆఫర్ తో ఈ 12GB వేరియంట్ ను సైతం 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది. ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.

Also Read: POCO Buds X1: ఈరోజు నుంచి మొదలైన బడ్జెట్ Hybrid ANC ఎయిర్ బడ్స్ సేల్.!

Infinix Note 40X 5G : ఫీచర్స్

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు డైనమిక్ బార్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ బెస్ట్ చిప్ సెట్ Dimensity 6300 తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB మరియు 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Infinix Note 40X 5G Features

ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ లో 108MP ప్రధాన కెమెరా + 2MP + AI లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 8MP పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ XOS 14 సాఫ్ట్ వేర్ పై Android OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ లో DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo