digit zero1 awards

చవక ధరలో 24GB RAM తో వచ్చిన Infinix Note 40 Pro+ 5G ఫస్ట్ సేల్.!

చవక ధరలో 24GB RAM తో వచ్చిన Infinix Note 40 Pro+ 5G ఫస్ట్ సేల్.!
HIGHLIGHTS

Infinix Note 40 Pro+ 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో 24GB RAM తో వచ్చింది

ఈ ఫోన్ రేపు భారీ ఆఫర్లతో మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్ లో సరికొత్తగా విడుదల చేసిన Infinix Note 40 Pro+ 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ చౌక ధరలో 24GB RAM మరియు ఫాస్ట్ వైర్లెస్ మాక్ చార్జ్ సపోర్ట్ వంటి చాలా ట్రెండీ ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ రేపు భారీ ఆఫర్లతో మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. వీటిలో కొన్ని ఆఫర్లు కేవలం రేపు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే, ఈ కొత్త ఫోన్ ఆఫర్స్ మరియు స్పెక్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Infinix Note 40 Pro+ 5G: ఫస్ట్ సేల్

ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ మొదటి సెల్ నుండి గొప్ప ఆఫర్లు కంపెనీ అందించింది. రేపు జరగనున్న మొదటి సేల్ నుండి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి 20W MagPower బాక్స్ తో పాటుగా లభిస్తుంది.

Infinix Note 40 Pro+ 5G Offers
Infinix Note 40 Pro+ 5G Offers

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా ఇన్ఫినిక్స్ అందించింది. HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 2,000 అధనపు బోనస్ ను అందుకోవచ్చు.

Infinix Note 40 Pro+ 5G: Price

ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ (12GB + 256GB) తో రూ. 24,999 రూపాయల ధరతో వచ్చింది. ఈ ఫోన్ ను పైన తెలిపిన ఆఫర్ల ద్వారా మొదటి సేల్ నుండి కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ దరకే కొనుగోలు చేయవచ్చు.

Also Read: భారీగా తగ్గిన Gold Price.. ఈరోజు ఎంత తగ్గిందంటే.!

ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో+ 5జి: ప్రత్యేకతలు

ఇక ఈ ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ పరిమాణం 55 డిగ్రీస్ 3D Curved 120 Hz AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది.

Infinix Note 40 Pro+ 5G Features
Infinix Note 40 Pro+ 5G Features

ఈ ఫోన్ పవర్ మేనేజ్మెంట్ కోసం Infinix X1 Cheetah చిప్ సెట్ వస్తుంది మరియు MediaTek Dimensity 7020 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. దీనికి జతగా 12GB ఫిజికల్ RAM మరియు 12GB అధనపు ర్యామ్ తో కలిపి టోటల్ 24GB RAM ఫీచర్ ను అందిస్తుంది. అంతేకాదు, 256GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

కెమేరా పరంగా, ఈ ఫోన్ లో 108MP (OIS) + 2MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమేరాతో 2K (at 30 fps) వీడియోలను మరియు గొప్ప ఫోటోలను షూట్ చెయ్యవచ్చని కంపెనీ చెబుతోంది.

ఈ ఫోన్ చార్జ్ టెక్ పరంగా గొప్ప ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 20W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 100W మల్టీ మోడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. పైన తెలిపిన విధంగా ఈ ఫోన్ పవర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకమైన Infinix X1 Cheetah చిప్ సెట్ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo