Infinix Note 40 Pro 5G Racing Edition స్మార్ట్ ఫోన్ ను ఇన్ఫినిక్స్ ఇండియాలో సరికొత్త గా విడుదల చేసింది. భారీ ఫీచర్స్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మొదలవుతుంది. ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ OIS 108MP ట్రిపుల్ కెమెరా మరియు గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈరోజు మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను అన్ని ఆఫర్లతో కలిపి రూ. 18,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ను Flipkart నుంచి సేల్ అవుతుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జి రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ BMW గ్రూప్ కంపెనీ సహకారంతో డిజైన్ చేసింది మరియు ఈ ఫోన్ డిజైన్ మరింత ఆకట్టుకునేలా అందించారు. ఈ ఫోన్ లో పటిష్టమైన గొరిల్లా గ్లాస్ రక్షణ కలిగిన 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ టి ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7020 5G చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 12GB అదనపు ర్యామ్ తో పాటు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో అందించిన 11 లేయర్ VC కూలింగ్ మరియు JBL డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
Also Read: PAN Update పేరుతో స్కామర్ల కొత్త ఎత్తుగడ.. జర భద్రం భయ్యా.!
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ కెమెరా + +2MP+2MP ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 2K వీడియోలు 30FPS వద్ద షూట్ చేసే వీలుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ఫోన్ DTS, Hi-RES మరియు WIDEVINE L1+ సర్టిఫికేషన్ లతో వస్తుంది. ఈ ఫోన్ 100W మల్టీ మోడ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో జతగా వస్తుంది మరియు ఇది 20W వైర్లెస్ ఛార్జ్ తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.