Infinix Note 40 Pro 5G భారత్ మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంఛ్ ను గురించి కంపెనీ గత వారమే టీజింగ్ అందించింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ ను ఏప్రిల్ నెలలో లాంఛ్ చెయ్యన్నట్లు అప్డేట్ ను విడుదల చేసింది. లాంఛ్ అప్డేట్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్ ను కూడా బయట పెట్టింది. కొత్తగా అందించిన టీజింగ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇన్ఫినిక్స్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ నెలలో లాంఛ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను ప్రస్తుతం ‘Coming Soon’ ట్యాగ్ తోనే తీజ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో లాంఛ్ డేట్ కంటే ముందే టీజర్ పేజ్ ద్వారా టీజ్ చేస్తోంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జ్ టెక్ ను గురించి వివరాలను టీజర్ పేజ్ నుండి బయట పెట్టింది. ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ గా వ్యవహరించనున్న Flipkart నుండి ఈ వివరాలతో టీజ్ చేస్తోంది. అంతేకాదు, కంపెనీ అధికారిక X అకౌంట్ నుండి కూడా తీజ్ చేస్తోంది.
ఈ ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ All-Round Fast Charge 2.0 టెక్ తో వస్తుందని కన్ఫర్మ్ చేసింది. ఈ టెక్ గురించి మరిన్ని ఇతర వివరాలను కూడా ఇన్ఫినిక్స్ అందించింది. ఈ ఫోన్ ను 20W వైర్లెస్ మ్యాగ్ ఛార్జింగ్ ఫీచర్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా ఉంటుంది.
అంటే, ఈ ఫోన్ తో ఇతర వైర్లెస్ పరికరాలను నేరుగా వైర్లెస్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఈ ఫోన్ లో అందించింది.
Also Read: ఈరోజే విడుదలైన vivo T3 5G Top-5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలు ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా తెలుస్తున్నాయి. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు Curved డిస్ప్లేతో కనిపిస్తోంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా మరియు రింగ్ లైట్ ను కూడా కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక ప్రీమియం లెథర్ డిజైన్ తో కూడా కనిపిస్తోంది.