చైనీస్ మొబైల్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఈరోజు భారత్ మార్కెట్ లో Infinix Note 40 5G ను పరిచయం చేసింది. ఈ ఫోన్ ను 20 వేల కంటే తక్కువ ధరలో వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ లు 20 వేల రూపాయల బడ్జెట్ లో మంచి ఫీచర్లతో వచ్చి ఉండగా, ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను వైర్లెస్ మెగ్ ఛార్జ్ మరియు డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ చిప్ వంటి అదనపు ఫీచర్లతో తీసుకువచ్చి పోటీని మరింతగా పెంచింది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జి స్మార్ట్ ఫోన్ ను 8GB + 256GB సింగల్ వేరియంట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 19,999 రూపాయల ధరతో ప్రకటించింది. HDFC, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ అందించే బ్యాంక్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ Flipkart ద్వారా జూన్ 26 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Redmi 13 5G: 108MP కెమెరా మరియు స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ తో లాంచ్ అవుతోంది.!
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జి స్మార్ట్ ఫోన్ Dimensity 7020 చిప్ సెట్ పవర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ తో కలిపి టోటల్ 16GB ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP మెయిన్ + 2MP + 2MP కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాతో 2K వీడియోలను మరియు మంచి ఫోటో గ్రఫీ ఆశించవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ముఖ్యంగా, ఈ బడ్జెట్ లో ఎన్నడూ లేని విధంగా వైర్లెస్ మ్యాగ్ ఛార్జ్ మరియు వైర్లెస్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో ఈ ఫోన్ ను అందించింది.