ఇన్ఫినిక్స్ ఈరోజు తన 12 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ Infinix NOTE 12i ని ఇండియాన మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అధిక బ్రిట్నెస్ లెవల్స్ కలిగిన AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమేరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో 10 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
ఇన్ఫినిక్స్ నోట్ 12i స్మార్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్ తో రూ.9,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోర్స్ బ్లాక్ మరియు మెటా వర్స్ బ్లూ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 12i స్మార్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిచగలదని ఇన్ఫినిక్స్ చెబుతోంది.ఈ ఫోన్ మీడియా టెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ఫీచర్ తో ఉంటుంది.
ఇక కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమేరా జతగా 2MP డెప్త్ కెమేరా మరియు QVGA కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా XOS 12 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఆడియో పరంగా, DTS Surround sound సపోర్ట్ ను కలిగి వుంటుంది.