50MP ట్రిపుల్ కెమేరా AMOLED డిస్ప్లేతో వచ్చిన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్.!
ఇన్ఫినిక్స్ 12 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
Infinix NOTE 12i ని ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన ఇన్ఫినిక్స్
ఆకర్షణీయమైన ఫీచర్లతో 10 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ అయ్యింది
ఇన్ఫినిక్స్ ఈరోజు తన 12 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ Infinix NOTE 12i ని ఇండియాన మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అధిక బ్రిట్నెస్ లెవల్స్ కలిగిన AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమేరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో 10 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
Infinix NOTE 12i: ధర
ఇన్ఫినిక్స్ నోట్ 12i స్మార్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్ తో రూ.9,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోర్స్ బ్లాక్ మరియు మెటా వర్స్ బ్లూ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Infinix NOTE 12i: స్పెక్స్
ఇన్ఫినిక్స్ నోట్ 12i స్మార్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిచగలదని ఇన్ఫినిక్స్ చెబుతోంది.ఈ ఫోన్ మీడియా టెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ఫీచర్ తో ఉంటుంది.
ఇక కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమేరా జతగా 2MP డెప్త్ కెమేరా మరియు QVGA కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా XOS 12 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఆడియో పరంగా, DTS Surround sound సపోర్ట్ ను కలిగి వుంటుంది.