4K 60fps కెమేరా 3D curved AMOLED డిస్ప్లేతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!

4K 60fps కెమేరా 3D curved AMOLED డిస్ప్లేతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
HIGHLIGHTS

4K 60fps కెమేరా 3D curved AMOLED డిస్ప్లేతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్

Infinix Zero 30 5G పేరుతో లాంచ్ చేస్తోంది

ఇన్ఫినిక్స్ జీరో 30 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది

4K 60fps కెమేరా 3D curved AMOLED డిస్ప్లేతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. Infinix Zero 30 5G పేరుతో లాంచ్ చేయబోతున్న ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 2 నుండి Pre-Orders కి అందుబాటులోకి వసుందని కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయునట్లు ప్రకటించిన ఇన్ఫినిక్స్ ప్రి ఆర్డర్స్ డేట్ ని కూడా ప్రకటించింది. అంతేకాదు, Infinix Zero 30 5G యొక్క మెయిన్ మరియు కీలకమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. 

Infinix Zero 30 5G: స్పెక్స్ 

Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ పేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను తేజ్ చేస్తోంది. ఇందులో, డిస్ప్లే, కెమేరా, డిజైన్ మరియు కలర్ అప్షన్ లి కనిపిస్తున్నాయి. అవేమిటో ఒక లుక్కేద్దాం. 

Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని డిజైన్ తో లాంచ్ చేస్తోంది ఇన్ఫినిక్స్. ఈ ఫోన్ 7.9mm మందంతో సన్నగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ను 6.78 ఇంచ్ Curved AMOLED 10bit డిస్ప్లేతో అందిస్తునట్లు కంపెనీ తెలిపింది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్, 2160 PWM డిమ్మింగ్ ఫ్రీక్వెన్సీ, 100% DCI-P3 వైడ్ కలర్ గ్యామూట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ వంటి వివరాలను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 

అంటే, ఈ ఫోన్ డిస్ప్లే మంచి విజువల్స్ తో పాటుగా చక్కని గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ను కూడా అందిస్తుందని, గేమింగ్ కోసం చాలా వేగవంతమైన రెస్పాన్స్ ను కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 

ఇన్ఫినిక్స్ జీరో 30 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో అందించిన మెయిన్ కెమేరా మరియు దాని సమర్ధతను ఇన్ఫినిక్స్ వివరించింది. ఈ ఫోన్ లో 50MP కెమేరా 60fps వద్ద 4K వీడియో రికార్డ్ చెయ్యగల కెపాసిటీని కలిగి ఉందని కూడా చెబుతోంది.

ఈ ఫోన్ Rome Green మరియు Golden Hour అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుందని కూడా చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ నాటికి మరిన్ని ఫీచర్లను కూడా ప్రకటిచనున్నట్లు డేట్స్ అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo