7 వేల ధరలో 6000mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్.!

Updated on 22-Feb-2023
HIGHLIGHTS

Infinix SMART 7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,299 ధరలో 6000mAh బ్యాటరీని కలిగివుంది

ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని వనరులను ఈ ఫోన్ కలిగివున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది

ఇన్ఫినిక్స్ ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను అతిపెద్ద బ్యాటరీతో విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. Infinix SMART 7 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,299 ధరలో 6000mAh బ్యాటరీని కలిగివుంది. అంతేకాదు, ఎంటర్టైన్మెంట్ ఉపయోగం కోసం అవసరమైన అన్ని వనరులను ఈ స్మార్ ఫోన్ కలిగివున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. సరికొత్తగా భారతీయ మార్కెట్ లో ప్రవేశపెట్టబడిన ఈ స్మార్ట్ ఫోన్  స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి. 

Infinix SMART 7: ధర మరియు సేల్

ఇంఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.7,299 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 26వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుండి Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Infinix SMART 7: స్పెక్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc ఆక్టా కోర్ ప్రోసెసర్ Spreadtrum SC9863A1 తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 3GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇన్ఫినిక్స్ అందించడం విశేషం. 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 లో అఫర్ చేస్తున్న కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ . ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీని టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :