10 వేల ధరలో అట్రాక్టివ్ ఫీచర్స్ తో వచ్చిన Infinix Hot 50 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది.!

Updated on 08-Sep-2024
HIGHLIGHTS

Infinix Hot 50 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, స్లీక్ బాడీ మరియు ఆల్ రౌండ్ ఫీచర్స్ తో వచ్చింది

ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేయండి

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ 10 వేల ధరలో అట్రాక్టివ్ ఫీచర్స్ తో లాంచ్ చేసిన Infinix Hot 50 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, స్లీక్ బాడీ, Sony 48MP డ్యూయల్ కెమెరా మరియు లాంగ్ బ్యాటరీ వంటి ఆల్ రౌండ్ ఫీచర్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.

Infinix Hot 50 5G : ప్రైస్

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు (9 సెప్టెంబర్) మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది.

ఈ ఫోన్ Flipkart నుంచి సేల్ అవుతుంది మరియు ఈ ఫోన్ పైన మంచి ఆఫర్లు కూడా ఇన్ఫినిక్స్ అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను కేవలం రూ. 8,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు.

Also Read: New Soundbar: భారీ ఫీచర్స్ తో కొత్త Dolby Audio సౌండ్ బార్ లాంచ్ చేసిన Boult బ్రాండ్.!

Infinix Hot 50 5G : ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో అట్రాక్టివ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం 7.82mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ బిగ్ స్క్రీన్ ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో కలిపి 16GB ర్యామ్ ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Infinix Hot 50

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP Sony IMX582 మెయిన్ కెమెరా + డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్
XOS 14.5 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ వుంది మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :