Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లో స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ చేసింది. ఇప్పటికే భారత మార్కెట్ లో 10 వేల బడ్జెట్ లో నడుస్తున్న చాలా ఫోన్ లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం వుంది. మరి ఈ కొత్త ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (4GB + 128GB) ను రూ. 9,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ను కేవలం రూ. 10,999 ధరతో విడుదల చేసింది. సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ Flipkart నుంచి మొదలవుతుంది. ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ప్రకటించింది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD+ రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 1600 x 720 రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ ఫాస్ట్ చిప్ సెట్ Dimensity 6300 తో అందించింది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS పై XOS 14.5 సాఫ్ట్ వేర్ తో పని పని చేస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక AI డ్యూయల్ కెమెరా వుంది. ఇందులో 48MP (Sony IMX582) మెయిన్ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 7.8mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే సరికొత్త డిజైన్ తో ఇన్ఫినిక్స్ అందించింది.
Also Read: Realme P2 Pro 5G: 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ డేట్ అనౌన్స్.!
ఈ ఫోన్ లో డైనమిక్ బార్ ఫీచర్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కు భరోసా కూడా కంపెనీ అందించింది. ఈ కొత్త ఫోన్ ను 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో ఇన్ఫినిక్స్ అందించింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో మరియు Infinix AI ఫీచర్ తో కూడా వస్తుంది.