డిఫరెంట్ డిజైన్ మరియు బిగ్ ర్యామ్ సపోర్ట్ తో కొత్త స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Infinix ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Infinix HOT 30i స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త ప్రీమియం డైమండ్ ప్యాట్రన్ డిజైన్ తో పాటుగా 16GB వరకూ ర్యామ్ ఫీచర్ తో తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
ఇన్ఫినిక్స్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix HOT 30i ను లాంచ్ అఫర్ లో భాగంగా రూ.8,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 3వ తేదీ నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30i స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ కి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇన్ఫినిక్స్ జతచేసినట్లు చెబుతోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30i లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగివుంది. ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 5000 mAh హెవీ బ్యాటరీని 10W టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో కలిగివుంది.