బడ్జెట్ ధరలో 8GB + 128GB ఫోన్ లాంచ్ .. ధర మరియు ఫీచర్లు ఇవే.!

బడ్జెట్ ధరలో 8GB + 128GB ఫోన్ లాంచ్ .. ధర మరియు ఫీచర్లు ఇవే.!
HIGHLIGHTS

Infinix ఇప్పుడు ఇండియాలో అతివేగంగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరిలో తనదైన శైలితో ఆకట్టుకుంటోంది

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో 8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ వేరియంట్ లలో ప్రకటించింది

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Infinix ఇప్పుడు ఇండియాలో అతివేగంగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అంతేకాదు, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేటగిరిలో తనదైన శైలితో ఆకట్టుకుంటోంది. మీ నెలలో హాట్ సిరీస్ నుండి పెద్ద బ్యాటరీతో Hot 12 Play స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఇన్ఫినిక్స్, ఈరోజు అదే సిరీస్ నుండి Hot 12 Pro స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ తన హాట్ 12 ప్రో ఫోన్ ను పేరుకు తగ్గట్టుగానే Pro ఫీచర్లతో తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే తో, 8జీబీ ర్యామ్ కి జతగా 5GB వర్చువల్ ర్యామ్ మరియు హెవీ 128GB స్టోరేజ్ వంటి మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది. లేటెస్ట్ గా వచ్చిన ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉందొ ఒక లుక్ వేద్దామా.   

Infinix Hot 12 Pro: ధర మరియు సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ భారీ 8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో (8GB + 64GB) వేరియంట్ ధర కేవలం రూ.10,999 కాగా (8GB + 128GB) వేరియంట్ ధర రూ.11,999 రూప్యాలు మాత్రమే. ఈ ఫోన్ ఆగష్టు 8 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.       

Infinix Hot 12 Pro: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T616 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జతచేసింది.

కెమెరా విషయానికి వస్తే, హాట్ 12 ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo