ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఇన్ఫినిక్స్ నుండి గేమింగ్ ప్రత్యేకంగా Infinix GT20 Pro స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకు రాబోతున్నట్లు ఇన్ఫినిక్స్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
ఇన్ఫినిక్స్ GT20 ప్రో స్మార్ట్ ఫోన్ May 21వ ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో టీజింగ్ ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుండి ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజింగ్ కూడా మొదలు పెట్టింది. గేమింగ్ బీస్ట్ గా గత సంవత్సరం వచ్చిన ఇన్ఫినిక్స్ GT 10 ప్రో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది.
ఈ స్మార్ట్ ఫోన్ తో పాటుగా Infinix GT Book ని కూడా విడుదల చేసినట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ ని 13th జెనరేషన్ Intel Core i9 ప్రోసెసర్, RGB Keyboard మరియు 32GB LPDDR5X RAM వంటి భారీ ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు కూడా తెలిపింది.
Also Read: రూ. 6,999 కే 12GB RAM Phone కావాలా .. అయితే, ఒక లుక్కేయండి.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ మరియు కొన్ని ఫీచర్స్ మాత్రమే కంపెనీ బయట పెట్టింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కొత్త Cyber Macha Design తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ డిజైన్ తో ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ గా మరియు వెనుక RGB లైట్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 144Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే ఉన్నట్లు ఇన్ఫినిక్స్ కన్ఫర్మ్ చేసింది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో అంచులు లేకుండా ఎక్కువగా విస్తరించిన స్క్రీన్ తో ఉన్నట్లు కూడా చెబుతోంది.
ఈ ఫోన్ యొక్క ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఈ కెమెరా OIS సపోర్ట్ ను కలిగి ఉన్నట్లు కూడా ఈ ఫోన్ ఇమేజ్ ద్వా చెబుతోంది. కాబట్టి, ఈ ఫోన్ యొక్క అప్డేట్ లను త్వరలోనే మనం చూసే వీలుంది.