Infinix GT 20 Pro: ఈ టాప్ 5 ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది.!
ఇన్ఫినిక్స్ 20 ప్రో స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది
ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కంపెనీ ప్రత్యేకంగా చెబుతోంది
ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ సెప్రోసెసర్ Dimensity 8200 4nm ప్రోసెసర్ తో వస్తుంది
Infinix GT 20 Pro: ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి రేపు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడుతోంది. అదే ఇన్ఫినిక్స్ 20 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది. ఈ మాట నేను అనడం లేదు, ఈ ఫోన్ కోసం అందించిన అందించిన టీజర్ క్యాంపైన్ నుంచి కంపెనీ గొప్ప చెబుతోంది. ఈ ఫోన్ ను కొత్త డిజైన్, డిస్ప్లే, ప్రోసెసర్ మరియు మరిన్ని ఫీచర్స్ తో అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
అయితే, ఇందులో కొన్ని ఫీచర్స్ ను గురించి మాత్రం ఇన్ఫినిక్స్ నొక్కి మరీ చెబుతోంది. మరి కంపెనీ ప్రత్యేకంగా చెప్తున్న ఫీచర్స్ లో టాప్ 5 ఫీచర్లు ఏమిటో ఈ రోజు చూద్దాం.
Infinix GT 20 Pro టాప్ 5 ఫీచర్లు
Display
ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కంపెనీ ప్రత్యేకంగా చెబుతోంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రె రేట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 94.3% స్క్రీన్ టూ బాడీ, FHD+ రిజల్యూషన్ ఉంటుంది మరియు గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుందని కూడా తెలిపింది.
Processor
ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ సెగ్మెంట్ ప్రోసెసర్ Dimensity 8200 4nm ప్రోసెసర్ తో వస్తుంది. దానికి జతగా డెడికేటెడ్ గేమింగ్ చిప్ సెట్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండింటి కలయికలో ఈ ఫోన్ అద్భుతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని చెబుతోంది.
Also Read: itel Unicorn: పెండెంట్ Smart Watch ను తెచ్చిన ఐటెల్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
Camera
ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం వుంది. ఇందులో 108MP మెయిన్ + డెప్త్ + మ్యాక్రో కెమెరా వున్నాయి. ఈ ఫోన్ లో 32 MP సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కెమెరాతో 60fps వద్ద స్టేబుల్ 4K Video లు మరియు స్టన్నింగ్ ఫోటోలు షూట్ చేయవచ్చని ఇన్ఫినిక్స్ గొప్పగా చెబుతోంది.
Battery & Charge
ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వివరాలను కూడా ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఈ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తోంది.
Audio & OS
ఈ స్మార్ట్ ఫోన్ ను JBL డ్యూయల్ స్పీకర్లతో అందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఈ ఫోన్ లో బ్లోట్ వేర్ లేని Clean Android 14 OS తో తీసుకొస్తున్నట్లు కూడా చెబుతోంది.
ఈ టాప్ 5 ఫీచర్స్ తో పాటుగా 12GB LPDDR5X RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.