ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించిన ఇన్ఫినిక్స్. ఈ అప్ కమింగ్ ఫోన్ తో ఫీచర్స్ తో ఈ ఫోన్ పైన అంచనాలను కూడా పెంచింది. Infinix GT 20 Pro స్మార్ట్ ఫోన్ ను 24GB RAM మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో తీసుకొస్తున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ఫోన్ కలిగిన మరిన్ని ఫీచర్స్ ని కూడా కంపెనీ టీజర్ ద్వారా బయట పెట్టింది. ఈ ఫీచర్స్ ను చూస్తుంటే ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తున్నట్లు క్లియర్ అవుతోంది.
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్ ఫోన్ ను మే 21వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్.
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Dimensity 8200 Ultimate తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ ప్రోసెసర్ మరియు ఇది 950K+ AnTuTU స్కోర్ కలిగి ఉంటుంది. దీనికి జతగా డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లే చిప్ సెట్ కూడా ఉన్నట్లు తెలిపింది.
Also Read: Gold Price: మళ్ళీ భారీ పెరుగుతున్న బంగారం ధర.. ఈరోజు తులం ప్రైస్ ఎంతంటే.!
ఈ ఫోన్ కలిగిన RAM మరియు స్టోరేజ్ వివరాలను కూడా కంపెనీ టీజర్ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోన్ లో 12GB LPDDR5X RAM మరియు 12GB అదనపు ర్యామ్ తో టోటల్ 24GB ర్యామ్ కలిగి ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 256GB హెవీ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్ ఫోన్ డిస్ప్లే వివరాలను కూడా కంపెనీ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుందని కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ డిస్ప్లే ఫోన్ లో 94% భాగాన్ని కలిగి చాలా సన్నని అంచులతో ఉంటుంది.