మొదట్లో వోడాఫోన్ దీపావళి ఆఫర్స్ ను ప్రవేశ పెట్టగా ఇప్పుడు ఎయిర్టెల్, ఐడియా, bsnl నెట్వర్క్స్ కూడా అదే queue లో ఉన్నారు. ఈ ఆఫర్స్ అన్నీ కొన్ని కండిషన్స్ తో వస్తాయి. సో రీ చార్జ్ చేసుకునే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాటి వెబ్ సైట్ లలో చూసి చేసుకోవటం మంచిది.
వోడాఫోన్ 100MB ఫ్రీ డేటా ఆఫర్ ను ఇప్పటికే ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ "One rate, One south" అనే పేరుతో కొత్త ఆఫర్ ఇస్తుంది. లోకల్, STD మరియు రోమింగ్ లలో సెకెండ్ కు 0.01 పైసా చప్పున ఇవనుంది 57 రూ రిచార్జ్ కు. ఇది కేవలం ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక, కేరళా, తమిళనాడు రాష్ట్రాల users కు మాత్రామే.
ఎయిర్టెల్ లో కొత్తగా డేటా ప్యాక్స్ ను వేసుకునే users కు 750 రూ వరకూ ఆఫర్ ఇస్తుంది భారతీ ఎయిర్టెల్. దీనితో పాటు, డైలీ 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ ప్రకారం డేటా ప్లాన్ వేసుకుంటే 50% డేటా అదనంగా క్రెడిట్ చేస్తుంది. ఇది 2G, 3G అండ్ 4G లకు వర్తిస్తుంది.
ఐడియా ఫ్రీడం ప్యాక్స్ పేరుతో స్టూడెంట్స్, కొత్త సబ్స్ స్క్రైబర్స్ అండ్ హౌస్ వైఫ్స్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 28 రోజుల validity తో 100 రూ లకు 300MB 2G డేటా మరియు 175 రూ లకు 500MB 3G డేటా ను ఇస్తుంది.
BSNL STV35 రిచర్జ్ తో లోకల్ మరియు STD కాల్స్ ఏ నెట్ వర్క్ కు అయినా నిమిషానికి 0.20 పైసా పడుతుంది. STV48 తో 80 లోకల్ అండ్ STD ఫ్రీ మినిట్స్ ఇస్తుంది.