ఈ రోజు నుండి మోబైల్ ఆపరేటర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటి (MNP) ను అమలు చేయనున్నారు. ఐడియా, వోడాఫోన్, రిలయన్స్, స్టేట్ వైడ్ BsnL మరియు కంట్రీ వైడ్ MTNL ఆపరేటర్స్ ఈ రోజు నుండి ఈ సేవలను ప్రారంభించారు. Airtel నిన్నే స్టార్ట్ చేసింది MNP ను. యునినార్, వీడియోకాన్ మరియు Sistema Tele services కూడా ఈ రోజు నుండి MNP ను స్టార్ట్ చేస్తారని చెప్పటం జరిగింది.
అయితే ఇంతకీ MNP వలన ఏంటి లాభం?
2011 లో మన ఇండియన్ మొబైల్ ఆపరేటర్లు జనరల్ పోర్టబిలిటీ ను ప్రారంభించారు. ఇది ఒక సర్విస్ నుండి మరో నెట్వర్క్ సర్వీస్ కు మారటానికి. అయితే ఇప్పుడు వచ్చిన కంప్లీట్ pan ఇండియా MNP తో మీరు ఒక రాష్టం లోని సిమ్ ను వేరే రాష్ట్రం లోని వేరే నెట్వర్క్ కు కూడా పోర్ట్ అవ్వగలరు. అంతకుమించి ఇక నుండి ఇండియాలో ఎక్కడికి వెళ్లినా రోమ్మింగ్ చార్జీలు ఉండవు ఈ రోజు నుండి.
ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగిన రీసర్చ్ రిపోర్ట్స్ ప్రకారం, ఇండియాలో 97.33 crore మొబైల్ వినియోగదారుల ఉన్నారు.