ఇండియాలో VR హెడ్ సెట్ తో 8,999 రూ లకు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 14-Jun-2016

Intex కంపెని Aqua  View పేరుతో Eyelet VR హెడ్ సెట్ తో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియాలో. ఇది గూగల్ కార్డ్ బోర్డ్ based VR. VR గురించి కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చూడండి.

మొబైల్ ప్రైస్ – 8,999 రూ. ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ హ్యాండ్ సెట్ బయట ఫిజికల్ స్టోర్స్ లోనే కూడా అందుబాటులో ఉంటుంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే with 294PPi, 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC, 2GB ర్యామ్, 8MP రేర్ ఆటో ఫోకస్ కెమెరా.

5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB అదనపు స్టోరేజ్. 4G VoLTE, బ్లూ టూత్ 4.0, 2200 mah బ్యాటరీ, Gyroscope సెన్సార్ ఉన్నాయి.

దీనితో పాటు వచ్చే VR మిగిలిన ఫోనులకు కూడా పనిచేస్తుంది. అయితే నా పర్సనల్ ఒపినియన్ ప్రకారం VR కోసం ఈ ఫోన్( ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి) తీసుకోవటం బదులు సెపరేట్ గా 200 రూ బేసిక్ VR(వివిధ వెబ్ సైట్ లలో మంచి రివ్యూస్ ఉన్నది) ను తీసుకోని మంచి స్పెక్స్(3GB ర్యామ్, మినిమమ్ 3000 mah)  తో వచ్చే ఫోన్ కొనటం మంచిది.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :