ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ తాజాగా చేసిన సర్వే లో విండోస్ ఫోన్ మార్కెట్ షేర్ రాబోవు నాలుగు సంవత్సరాలలో పెరగనున్నాయి అట. 2015 లో ఉన్న 3.2 శాతం 5.4 శాతానికి 2019 కల్లా పెరగనుంది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వారి వరల్డ్ వైడ్ క్వాటర్లి మొబైల్ ఫోన్ ట్రాకర్ లెక్కలు ప్రకారం విండోస్ ఫోన్ షిప్మెంట్స్ 46.8 మిలియన్ నుండి 103.5 మిలియన్ యునిట్స్ కు పెరగనున్నాయి. అదే సమయంలో ఆండ్రాయిడ్ మరియు ఐ ఓస్ మార్కెట్ ను పోగొట్టుకానున్నాయి అని చెబుతుంది IDC.
34.1 శాతం గ్రోత్ రేట్ తో ఈ సంవత్సరం విండోస్ 3.2 శాతం స్మార్ట్ ఫోన్ సేల్స్ పొంది 46.8 మిలియన్ విండోస్ ఫోన్ హ్యాండ్ సెట్స్ ను షిప్ చేయనున్నాయి. అయితే ఆండ్రాయిడ్ 1.15 బిలియన్ యూనిట్స్ తో 79.4 శాతం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను 2015 చివరికల్లా సొంతం చేసుకుంటుంది. IDC ప్రేడిక్షన్స్ ప్రకారం ఈ సంవత్సరంలో 8.5 శాతం షిప్మెంట్స్ ను పెంచుకోనుంది ఆండ్రాయిడ్. ఆపిల్ ఐ ఓస్ 237 మిలియన్ ఐ ఫోనులను మరియు 16.4 శాతం గ్లోబల్ మార్కెట్ ను సొంతం చేసుకుంటుంది. ఆపిల్ ప్రతీ సంవత్సరం 23 శాతం గ్రోత్ రేట్ ను ఇస్తుంది.
అలాగే 2019 నాటికి ఆండ్రాయిడ్ 1.5 బిలియన్ల హాండ్ సెట్లను కన్నా ఎక్కువ షిప్పింగ్ చేయనుంది. ఇది గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 79 శాతం షేర్. గత 5 సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ 7.5 శాతం ఏన్యువల్ గ్రోత్ రేట్ తో కొనసాగుతుంది. ఆపిల్ 274.5 మిలియన్ ఫోనులను 2019 లో షిప్పింగ్ చేయనుంది. ఇది 14.2 శాతం మార్కెట్ షేర్ అవుతుంది అప్పటి సంవత్సరానికి. ఆండ్రాయిడ్ కూడా 2015 లో ఉన్న 8.5 శాతం గ్లోబార్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ కన్నా కిందకు పడి పోవనుంది అని IDC చెబుతుంది.
మొత్తం 24.3 శాతం గ్రోత్ రేట్ తో 103.5 మిలియన్ల విండోస్ ఫోనులను 2019 లో షిప్పింగ్ చేయనుంది అని IDC రిపోర్ట్స్. ఆపిల్, ఆండ్రాయిడ్ కన్నా ట్రిపుల్ గ్రోత్ రేట్ , 24.3 శాతం విండోస్ ఫోన్ ఓస్ సొంతం చేసుకోనుంది.
ఓవర్ ఆల్ గా IDC స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్స్ 11.3 శాతానికి 2015 లో పెరగనుంది. 2019 కి అల్లా వరల్డ్ వైడ్ స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్స్ 1.9 బిలియన్ యునిట్స్ ప్రతి సంవత్సరం అమ్ముడుకానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ గ్రోత్ రేట్ మొదటి సారిగా 2015 సంవత్సరం లో మొదలు అయ్యింది.
ఆధారం: IDC