ప్రీమియం ఫోన్ లుగా దశబ్దాలుగా రాజ్యమేలుతున్న ఫోన్లుగా Apple iPhone లు నిలుస్తాయి. ఈ ఫోన్ రేటు చాలా ప్రియం అయినా కూడా ఈ ఫోన్ అందించే సేఫ్టి మరియి సెక్యూరిటీ కారణంగా ఐఫోన్ లను కొనడానికి ప్రజలు ఎక్కువగా మక్కువ చూపేవారు. అయితే, రోజులు మారుతున్న కొద్దీ ఈ ఫోన్ ఒక స్టేటస్ సింబల్ గా మారడం కూడా మనం చూస్తున్నాము. అయితే, యాపిల్ ఐఫోన్ వాడుతున్న వారికి కోసం జారీ చేసిన ప్రభుత్వ హెచ్చరిక ఇప్పుడు కలకలం రేపుతోంది.
యాపిల్ ప్రోడక్ట్స్ లో మల్టిపుల్ వల్నరబిలిటీస్ (హాని పొందడానికి) వీలునట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ICERT) రిపోర్ట్ అందించింది. CERT-In అడ్వైజరీ CIAD -2023-0047 సూచన ద్వారా ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. ఈ అడ్వైజ్ ను డిసెంబర్ 15న తన తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ICERT) నివేదించింది.
ఐఫోన్ ల సెక్యూరిటీ గురించి CERT-In చాలా విషయాలను లిస్ట్ చేసింది. ఇందులో రీసెంట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్లు కూడా ఉండడం విశేషం. ఈ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ డివైజ్ లు సెన్సిటివ్ ఇంఫర్మేషన్ ను సేకరించడానికి, ఎగ్జిక్యూటివ్ ఆర్బిటరీ కోడ్స్ మరియు సెక్యూరిటీ రిస్ట్రిక్షన్ లను బైపాస్ చెయ్యడానికి అటాకర్స్ కి అవకాశం ఇస్తుందని తెలిపింది.
ఇందులో, యాపిల్ iOS వెర్షన్ 17.2, iOS వెర్షన్ 16.7.3, యాపిల్ మ్యాక్ OS 14.2 ఉన్నాయి. అంతేకాదు, ఐప్యాడ్OS వెర్షన్ 17.2, ఐప్యాడ్OS వెర్షన్ 16.7.3, యాపిల్ మ్యాక్ OS 13.6.3,యాపిల్ మ్యాక్ OS 12.7.2 డివైజెస్ కూడా వున్నాయి.
Also Read : Poco C65 First Sale: భారీ ఆఫర్లతో పోకో బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!
ఇవి మాత్రమే కాదు యాపిల్ వాచ్ OS 10.2 మరియు యాపిల్ టీవీOS వెర్షన్ 17.2 పైన పనిచేసే టీవీ లు కూడా ఈ పరిధిలోకి వస్తాయని ICERT నివేదించింది. అంతేకాదు, దీనికి సంబంధించి యాపిల్ అందించిన కొత్త యాపిల్ సెక్యూరిటీ అప్డేట్ లను కూడా ఈ వెబ్సైట్ నుండి వివరాలు మరియు లింక్స్ తో సహా అందించింది.
పైన తెలిపిన OS పైన పనిచేసే డివైజ్ లలో హైరిస్క్ ఫ్యాక్టర్ వివరాలను కూడా వెబ్సైట్ లో సైట్ లో లిస్ట్ చేసింది. అయితే, కస్టమర్ సెక్యూరిటీ పరంగా ఎటువంటి సమస్యలు ఉండవని, ఒక అటువంటివి ఉన్నా కూడా వాటిని పూర్తిగా అధ్యయనం చేసే వరకూ ఎటువంటి వివరాలను బయటపెట్టడం జరగదని యాపిల్ సపోర్ట్ పేజ్ నుండి వివరించింది.
నోట్: పైన అందించిన స్క్రీన్ షాట్ ICERT వెబ్సైట్ నుండి తీసుకోబడినది.