iball కంపెని తరుచుగా కాకుండా అప్పుడప్పుడు స్మార్ట్ ఫోనులను లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం iBall Cobalt సిరిస్ లో mSLR మోడల్ ను లాంచ్ చేస్తుంది. 8,499 రూ లకు అమ్మకం కానున్న mSLR 4 డిటాచ్బల్ లెన్స్ తో ఫోటోగ్రఫీ లవర్స్ ను టార్గెట్ గా మార్కెట్ లోకి కొన్ని వారాల్లో రానుంది.
iBall కెమేరా స్పెసిఫికేషన్స్ – 8MP డ్యూయల్ LED బ్యాక్ కెమేరా మరియు సాఫ్ట్ LED ఫ్లాష్ 3.2MP ఫ్రంట్ కెమేరా , 8x జూమ్ లెన్స్, 175-180 డిగ్రీ ఫిష్ eye లెన్స్ వ్యూయింగ్ ఏంగిల్, 10x మాగ్నిఫికేషన్ మేక్రో లెన్స్ మరియు 10-15 mm మినిమమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, 130 డిగ్రి వ్యూయింగ్ వైడ్ ఏంగిల్ లెన్స్
iBall mSLR ఇతర స్పెసిఫికేషన్స్ – 5in qHD 960 x 540 పిక్సెల్స్ డిస్ప్లే, 1.4 GHz ఆక్టో కోర్ ప్రోసెసర్, 1జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, 3G, వైఫై, బ్లూటూత్, GPS, ప్రాక్సిమిటీ, Ambient లైట్ మరియు accelerometer సెన్సార్స్, 2,000 mah బ్యాటరీ ఉన్నాయి.
iBall HotKnot ఫైల్ ట్రాన్సఫర్ టెక్నాలజీ , ఫ్లిప్ టు మ్యుట్ ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ తో పాటు ఫ్రీ గా పొచ్ మరియు లెన్స్ లను క్లిన్ చేసే క్లాత్ కూడా ఇవనుంది కంపెని. 15 ఇండియన్ భాషలు సపోర్ట్ చేస్తుంది. ధర పరంగా ఇది Huawei 4C మరియు ఆసుస్ జెన్ ఫోన్ 5 (8GB) కు పోటీ ఇచేటట్టు ఉంది.
ఆధారం: TOI