Moto G54 5G: కొత్త ఫోన్ పైన భారీ తగ్గింపు..15 వేలకే 12GB ఫోన్ అందుకోండి.!
మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Moto G54 5G పైన భారీ తగ్గింపు
12GB స్మార్ట్ ఫోన్ ను కేవలం 15 వేల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం
ఈ ప్రైస్ కేటగిరిలో 12GB RAM తో లభిస్తున్న ఏకైక 5G ఫోన్
మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Moto G54 5G పైన భారీ తగ్గింపు ప్రకటించింది. అందుకే, ఈ మోటో 5జి యొక్క 12GB వేరియంట్ ను కేవలం 15 వేల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం వచ్చింది. మోటోరోలా ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ ధరలోనే లభించడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ప్రైస్ కేటగిరిలో 12GB RAM తో లభిస్తున్న ఏకైక 5G ఫోన్ గా కూడా మోటో జి54 నే నిలుస్తుంది.
Moto G54 5G: Offer Price
మోటో జి54 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రెండు వేరియంట్స్ లో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఇందులో, 8GB + 128GB వేరియంట్ ను రూ. 15,999 రూపాయల ధరలో విడుదల చెయ్యగా, ఇప్పుడు రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 13,999 ధరకే సేల్ అవుతోంది. అలాగే, 12GB + 256GB వేరియంట్ ను రూ. 18,999 ధరతో విడుదల చెయ్యగా, ఇప్పుడు రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 ధరకే సేల్ చేస్తోంది.
బ్యాంక్ ఆఫర్స్
ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart ప్లాట్ ఫామ్ నుండి Citi-branded క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి రూ. 1,500 రూపాయలు, Canara Bank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అయితే, ఈ ఫోన్ ను మోటోరోలా అధికారిక వెబ్సైట్ motorola.in నుండి IDFC First, Bank of Baroda మరియు Onecard క్రెడిట్ కార్డ్స్ తో కొనే యూజర్లకు రూ. 1,500 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read : Smartphone: 6 వేలకే DTS స్పీకర్లు మరియు 8GB RAM ఫోన్ కావాలా.!
మోటో జి54 5జి స్పెక్స్ & ఫీచర్స్
మోటో జి54 5జి ఫోన్ MediaTek Dimensity 7020 ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్. ఈ ఫోన్ 12GB/8GB RAM మరియు 256GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ అందించగల 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లే వుంది. ఈ ఫోన్ 3D Premium PMMA బాడీ మరియు IP52 వాటర్ రెపెళ్లేంట్ డిజైన్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో 50MP OIS + 8MP క్వాడ్ ఫిక్షన్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా వుంది. మెయిన్ కెమెరాతో 30fps వద్ద FHD వీడియోలను, HDR మరియు RAW Photo లను చిత్రీకరించే వీలుంది. ఈ ఫోన్ లో హెవీ 6000 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లను Dolby Atmos మరియు Moto Spatial Sound సపోర్ట్ తో అందించింది.