Huawei Y9 (2019) అమెజాన్ సేల్ మొదలు : అమేజాన్ ప్రత్యేకంగా

Updated on 15-Jan-2019
HIGHLIGHTS

Huawei భారతదేశం లో గత వారం Y సిరీస్ ఫోన్ అయినటువంటి, Huawei Y9 (2019)ని గత వారం ప్రారంభించింది.

Huawei భారతదేశం లో గత వారం Y సిరీస్ ఫోన్ అయినటువంటి, Huawei Y9 (2019)ని గత వారం ప్రారంభించింది. ఈ మధ్యస్థాయి స్మార్ట్ఫోన్ రూ .15,990 ధర వద్ద ప్రారంభించబడింది. ఈ డివైజ్ యొక్క మొదటి సెల్ నేడు అమెజాన్ ఇండియాలో ప్రారంభించబడుతుంది. Huawei Y9 కొనుగోలు చేసేటప్పుడు, వినియోగదారులు రూ. 2,990 రూపాయల విలువైన బోట్ రాకర్జ్ స్పోర్ట్స్ బ్లూటూత్ హెడ్ సెట్ ను ఉచితంగా పొందుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు సఫారి బ్లూ రంగు ఎంపికలలో లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్ లో ఈ స్మార్ట్ఫోన్ సెల్ ప్రారంభమయింది.

Huawei Y9 ప్రత్యేకతలు 

Huawei Y9 ఒక 6.5 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2340 x 1080p మరియు దాని ఆస్పెక్ట్ రేషియో 19.5: 9 గ ఉంటుంది. ఈ సంస్థ దాని పూర్తిస్థాయి ప్రదర్శన ప్యానెల్ పేరును ఇచ్చి, 3D కర్వ్ రూపకల్పనకు ఇవ్వబడింది. పైన పేర్కొన్నట్లు, ఈ స్మార్ట్ఫోన్ HiSilicon కిరిన్ 710 SoC AI పవర్ 7.0 మరియు అన్ని AI-సంబంధిత విధులతో వచ్చే ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆధారితమైనది. ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఈ  డివైజ్, GPU టర్బో సాంకేతికతతో వస్తుంది, ఇది పరికరం యొక్క గ్రాఫిక్ పనితీరును పెంచుతుంది మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఆప్టిక్స్ గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ వెనుక మరియు ముందు కెమెరాలను కలిగి ఉంది. ఈ హువావే Y9, 13 MP + 2 MP డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది, ఇది AI సీన్ డిటెక్షన్ మరియు Bokeh ఫీచర్తో వస్తుంది. ఈ ఫోనుకు ముందు 16MP + 2MP డ్యూయల్ కెమెరా కూడా అందించబడుతుంది. 16MP సెన్సార్ f / 2.0 అపర్చేర్ లెన్స్ తో పరిచయం చేయబడింది మరియు ఇది 4-లో -1 Binning తక్కువ కాంతి పిక్సెల్స్ అభివృద్ధి ఫోటోగ్రఫీ చేయడానికి మద్దతుగా నిలుస్తుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది పవర్ వినియోగం ఆప్టిమైజేషన్ మద్దతుతో వస్తుంది, ఇది శక్తిని తక్కువగా వాడుకునేలా చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :