బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ మరియు GPU టర్బోతో విడుదలకానున్న Huawei Y9 (2019)

బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ మరియు GPU టర్బోతో విడుదలకానున్న Huawei Y9 (2019)
HIGHLIGHTS

కొత్త సంవత్సరంలో, తన స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి హువావే సిద్ధంగావుంది.

కొత్త సంవత్సరంలో, తన స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి హువావే సిద్ధంగావుంది. జనవరి 7 న భారతదేశంలో హువావే Y9 (2019) ను విడుదల చేయనున్నట్లు దీనికి సంభందించిన ఆహ్వానాలను కూడా పంపించింది. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలో జరుగనున్నది. అయితే, ఈ ఫోన్ రాకముందే అమెజాన్ ఇండియా ఇది అంజాన్ ప్రత్యకంగా ఉండనున్నట్లు టీజ్ చేస్తోంది మరియు ఇ-టైలర్ 'నోటిఫై మీ' బటన్ను లైవ్ చేసింది. ఈ ఫోన్ లభ్యతకు సంబంధించిన అప్డేట్ పొందాలనుకునే వారు ఈ బటన్ను నొక్కడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఈ ఫోన్ యొక్క ముఖ్యాంశాలుగా, ఒక పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లే, 4,000 mAh బ్యాటరీ మరియు GPU టర్బోలను గురించి చెప్పొచ్చు. GSMArena ప్రకారం, ఈ ఫోన్ గత సంవత్సరం అక్టోబర్ లో ప్రకటించారు మరియు ఇది ఒక Kirin 710 SoC శక్తితోఉంటుంది. రియర్-మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్, డ్యూయల్ వెనుక మరియు ముందు కెమెరాలతో  ఈ ఫోన్ వస్తుంది.      

Huawei Y9 (2019) స్పెసిఫికేషన్లు

Huawei Y9 (2019) 1080 x 740 పిక్సల్స్ రిజల్యూషన్ మరియు ఒక 19.5: 9 యాస్పెక్ట్ రేషియో అందిస్తున్న ఒక పెద్ద 6.5-అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే తో ఉంటుంది. ఇది HiSilicon కిరిన్ 710 ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంది మరియు రెండు RAM మరియు స్టోరేజి రకాల్లో లభిస్తుంది. ఒక 3GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజి వేరియంట్ మరియు మరొక 4GB RAM మరియు 64GB స్టోరేజి వేరియంట్లతో ఉంటుంది. మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ మరియు అరోరా పర్పుల్ రంగులలో ఈ ఫోన్నీ ప్రారంభించవచ్చు. ఇది  Android 8.1 Oreo ఆధారితంగా EMUI 8.2 పైన నడుస్తుంది.

ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక డ్యూయల్  కెమెరా సెటప్పును కలిగివుంటుంది, ఇది 13MP ప్రాధమిక సెన్సారుతో  f / 1.8 ఎపర్చర్ కలిగి ఉంటుంది మరియు f / 2.4 ఎపర్చరుతో మరొక 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. వెనుక కెమేరా సెటప్ HDR కి మద్దతు ఇస్తుంది మరియు దీనితో 30fps వద్ద పూర్తి HD వీడియోలను షూట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోనులో ముందువైపు కూడా డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ప్రాధమిక కెమెరా f / 1.0 ఎపర్చరుతో 16MP రిజల్యూషన్ కలిగి ఉంటుంది, మరియు ఇతర కెమేరా f / 2.4 ఎపర్చరుగల 2MP సెన్సార్ వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo